Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్.. ఏఎన్నార్ రోల్స్ ఎవరు చేస్తారో?

By:  Tupaki Desk   |   18 Aug 2016 1:00 PM IST
ఎన్టీఆర్.. ఏఎన్నార్ రోల్స్ ఎవరు చేస్తారో?
X
మహానటి.. టాలీవుడ్ లో ఇప్పుడీ ప్రాజెక్ట్ గురించి హాట్ హాట్ గా మాటలు జరుగుతున్నాయి. ఎవడే సుబ్రమణ్యంతో గుర్తింపు పొందిన దర్శకుడు నాగ్ అశ్విన్.. మహానటి ప్రాజెక్టుపై విస్తృతంగా రీసెర్చ్ చేసేయగా.. త్వరలో పట్టాలెక్కించేందుక రెడీ అయిపోతున్నాడు. ఇప్పటికే టైటిల్ రోల్ లో నిత్యా మీనన్ నటిస్తోందనే ప్రచారం జరగగా.. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు.

మహానటి సావిత్రిపై సినిమా అనగానే ఇదేదో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం అనిపించడం సహజం. కానీ దీన్ని ఓ మల్టీ స్టారర్ రేంజ్ లో తీర్చిదిద్దనున్నారని తెలుస్తోంది. సావిత్రి జీవితంపై అనగానే.. అందులో ఎన్టీఆర్.. ఏఎన్నార్ ల పాత్రలు తప్పనిసరి. అటు సినిమా.. ఇటు వ్యక్తిగత జీవితాలను చూపించాలి కాబట్టి.. ఈ ఇద్దరు దిగ్గజ నటులు కూడా సినిమాల్లో పాత్రలుగా ఉండాలి. మరి ఎన్టీఆర్ గా నందమూరి వారసుల్లో ఒకరిని.. ఏఎన్నాఆర్ గా అక్కినేని వారసుడిని చూపించాల్సిందే. అంటే ఎన్టీఆర్ గా బాలయ్యనో జూనియర్ నో.. చూపించాలన్న మాట. అలాగే ఏఎన్నార్ గా నాగ్ కానీ.. చైతు కానీ యాక్ట్ చేయాల్సొస్తుంది.

ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతీ పాత్రకు క్రేజ్ ఉన్నోళ్లను తీసుకుంటూ పోతే.. చివరకు మహానటి ఏ రేంజ్ మల్టీ స్టారర్ అవుతుందో ఊహించడం కూడా కష్టమే. మరి ఇంత భారీ కాస్టింగ్ తో భారీ కాన్వాస్ తో సినిమాని పూర్తి చేయడం నాగ్ అశ్విన్ కు సవాలే అయినా.. ఈ కుర్ర డైరెక్టర్ పట్టుదల ముందు అవన్నీ చిన్నవిగానే అనిపిస్తున్నాయి.