Begin typing your search above and press return to search.
ఆ విషయంలో ఎన్టీఆర్ ఎంత చెప్పినా ఏఎన్నార్ వినలేదట!
By: Tupaki Desk | 8 July 2022 8:30 AM GMTఎన్టీఆర్ - ఏఎన్నార్ తెలుగు సినిమాకి రెండు కళ్ల వంటివారు. పౌరాణికాలలో ఎన్టీఆర్ తనకి తిరుగులేదనిపించుకుంటే, రొమాన్స్ ప్రధానమైన సాంఘిక చిత్రాలలో ఏఎన్నార్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇద్దరూ పోటీలుపడి తమ సినిమాలను రిలీజ్ చేయించేవారు. సమఉజ్జీలుగా అనిపించే ఇద్దరు కథానాయకులు కలిసి నటించడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. కానీ ఎన్టీఆర్ - ఏఎన్నార్ మాత్రం 15 సినిమాల్లో కలిసి నటించారు.
ఎన్టీఆర్ కి పౌరాణికాలలో మంచి పట్టు ఉంది. రాముడు .. కృష్ణుడు .. విష్ణువు మొదలైన పాత్రలు ఆయనే ధరించేవారు. ఒక్కోసారి తాను ఇతర ప్రధానమైన పాత్రలను పోషించేటప్పుడు ఆ పాత్రలకు హరనాథ్ ను గానీ .. కాంతారావును గాని అడిగేవారు. అయితే ఒకసారి మాత్రం తన సినిమాలో కృష్ణుడు వేషాన్ని వేయవలసిందిగా ఏఎన్నార్ ను ఎన్టీఆర్ కోరారట. 'ఆ మాట మాత్రం అడగకండి మహానుభావా' అంటూ ఏఎన్నార్ సున్నితంగా తిరస్కరించారట. ఆ విషయాలను గురించి ఒక సందర్భంలో అక్కినేని ఇలా చెప్పుకొచ్చారు.
"ఎన్టీఆర్ గారికి పౌరాణికాలలో ఎదురులేదు. రావణుడు .. దుర్యోధనుడు వంటి దుర్మార్గపు పాత్రలను సైతం వేసి మెప్పించినవారాయన. కర్ణుడు పాత్రలో కంటతడి పెట్టించినవారాయన. ప్రేక్షకులు ఆ తరహా పాత్రలలో కూడా ఆయనను అంగీకరించారు .. అందుకు కారణం ఆయన ప్రతిభ. అలాంటి ఆయన నన్ను ఒక సినిమాలో శ్రీకృష్ణుడిగా వేయమన్నారు. నిజానికి శ్రీకృష్ణుడిలోని చిలిపితనం .. గడుసుతనం .. మాటలాగారడి చేయడం ఇలాంటి లక్షణాలన్నీ నాలోనే ఎక్కువ. కానీ అప్పటికే ఆ వేషంలో ఎన్టీఆర్ పాప్యులర్ అయ్యారు గనుక నేను వేయదలచుకోలేదు.
దాంతో ఆయన అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారితోను సిఫార్స్ చేయించారు. ఆయన అడిగినప్పటికీ, 'ఆ పాత్రను నేను చేయడం కరెక్టు కాదండీ' అనే చెప్పాను. అదే 'చాణక్య చంద్రగుప్త' సినిమాలో నన్ను చంద్రగుప్తుడిగా వేయమని ఎన్టీఆర్ గారు అడిగితే, నా బాడీ లాంగ్వేజ్ కి చాణక్య పాత్ర కరెక్ట్ అని చెప్పేసి ఆ వేషమే వేశాను. ఎప్పుడైనాగానీ నాకు తగని పాత్రలను చేయడానికి నేను ప్రయత్నించలేదు. ఎన్టీఆర్ భగవంతుడు పాత్రలకి చక్కగా సరిపోతారు. నేను భక్తుడి పాత్రలను సెట్ అవుతాను. 'భక్తతుకారం' .. 'చక్రధారి' .. విప్రనారాయణ' వంటి సినిమాలు హిట్ కావడానికి అదే కారణం" అంటూ చెప్పుకొచ్చారు.