Begin typing your search above and press return to search.
పోటీ ఉంటే కష్టం పెరిగి బెస్ట్ వస్తుందిగా
By: Tupaki Desk | 11 Nov 2015 11:30 AM GMTఇప్పుడంటే వారానికి - రెండు వారాలకి ఒక పెద్ద సినిమానే రిలీజ్ చేయాలని అంటున్నారు కానీ.. ఇంతకు ముందైతే ఒకే రోజు రెండు - మూడు భారీ చిత్రాలు కూడా రిలీజ్ అయ్యేవి. ఒకదానితో ఒకటి పోటీ పడేవి. చిరు - బాలయ్య - నాగ్ - వెంకీ తరంలో ఈ పోటీ బాగా ఉండేది. కష్టపడి బెస్ట్ అందించేందుకు ట్రై చేసేవారు అందరూ. ఇప్పుడు పోటీ లేకుండా రిలీజ్ చేయాలనే తాపత్రయం పెరుగుతోంది. ఈ ట్రెండ్ కి నందమూరి వారసులు బ్రేక్ వేయబోతున్నారు.
జనవరి 8న ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో - జనవరి 14న బాలయ్య డిక్టేటర్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అంటే నందమూరి వారసుల మధ్యే పోటీ తప్పనిసరి. ఇలా పోటీ ఉంటే మేటిగా నిలిచేందుకు యూనిట్ వర్గాలు కష్టపడతాయని ఈజీగానే చెప్పచ్చు. అసలు రేస్ లేకపోతే పస ఏముంటుంది చెప్పండి. అయినా.. ఇప్పుడున్న వారసత్వం ట్రెండ్ లో అసలు పోటీ లేకుండా సినిమా రిలీజ్ చేయడం సాధ్యమేనా అనే డౌట్ రావడం ఖాయం.
మెగా ఫ్యామిలీ - నందమూరి - అక్కినేని వంశాల నుంచి బోలెడు మంది హీరోలున్నారు మన దగ్గర. వచ్చినోళ్లు - రాబోయే వాళ్లందరినీ కౌంట్ చేస్తే.. లెక్క ఓ పాతిక దగ్గర ఆగుతుందేమో. మరి అంతమంది ఉన్నపుడు పోటీ లేకుండా రిలీజ్ చేయడం ఎలా సాధ్యమవుతుందని ఆలోచించాలి. కాకపోతే ఇంతకుముందు ఇతర హీరోలతో పోటీ పడేవాళ్లు.. ఇప్పుడు సొంతవాళ్లతోనే పడాల్సొస్తుంది. అదయిన మంచిదే కదా.. ఆరోగ్యకరమైన పోటీ ఉంటే.. జనాలు మంచి సినిమాలు చూసే అవకాశం వస్తుంది. సినిమాలో సత్తా ఉండాలే కానీ.. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టచ్చని బాలయ్య ఎప్పుడో ప్రూవ్ చేశాడు కదా.