Begin typing your search above and press return to search.

కామెంట్‌: ఇద్దరూ రికార్డులు కొట్టొచ్చు

By:  Tupaki Desk   |   10 Nov 2015 10:30 PM GMT
కామెంట్‌: ఇద్దరూ రికార్డులు కొట్టొచ్చు
X
సంక్రాంతి పండుగ నాడు వస్తున్నానని ముందే అనౌన్స్ చేశాడు బాలయ్య. ఇప్పుడు పొంగల్ రిలీజ్ కి రెడీ అని తేల్చేశాడు ఎన్టీఆర్. అంటే మధ్యలో ఏదో రాజీ అనీ, వాయిదా అనీ చెప్పినవన్నీ తేలిపోయినట్లే. ఇప్పుడు జనవరి 8న జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, జనవరి 14న బాలకృష్ణ డిక్టేటర్ థియేటర్లలోకి రావడం ఫిక్స్ అయిపోయింది. ఇక నందమూరి ఫ్యాన్స్ జాతరకు సిద్ధం కావడమే పెండింగ్.

వారం రోజుల తేడాతో రెండు నందమూరి సినిమాలో.. అమ్మో ఒకటి వాయిదా వేయాల్సిందే అంటున్నారు కొంతమంది. అయితే.. మనకి సంక్రాంతి చాలా పెద్ద పండుగ. ఒకటేంటి.. రెండేసి, మూడేసి సినిమాలు రిలీజైన సందర్భాలు బోలెడున్నాయి. అంతెందుకు వరుసగా రెండేళ్లపాటు ఇదే పండుగకు రామ్ చరణ్ - మహేష్ బాబు పోటీ పడ్డారు. సీతమ్మ వాకిట్లో - నాయక్ చిత్రాలు ఇదే సీజన్ కి రెండు రోజుల తేడాతో రిలీజై.. రెండూ సక్సెస్ సాధించాయి. గతేడాది వన్ నేనొక్కడినే - ఎవడు చిత్రాు రిలీజయ్యాయి. ఇక్కడ ఫెయిల్యూర్ కంటెంట్ పై ఆధారపడింది కానీ.. పండగ సీజన్ పై కాదనే విషయం గుర్తుంచుకోవాలి.

అలాగే ఇప్పుడు డిక్టేటర్ - నాన్నకు ప్రేమతో మూవీస్ వారం గ్యాప్ లో వస్తున్నాయి. ఇద్దరూ నందమూరి హీరోస్ అని ఆలోచించడమే తప్ప.. కలెక్షన్స్ విషయంలో ఆలోచించాల్సిన అవసరం అంతగా ఉండదు. మూవీలో కంటెంట్ ఉంటే.. నిర్భయంగా సంక్రాంతికి సెట్టయిపోవచ్చు. రెండు భారీ బడ్జెట్ మూవీస్ ని తట్టుకోగలిగే స్టామినా పొంగల్ కి ఉంది.