Begin typing your search above and press return to search.
బసవతారకంతో 'ఎన్టీఆర్' వివాహం
By: Tupaki Desk | 29 Oct 2018 8:17 AM GMTవెండి తెరపై వెలుగు వెలిగిన ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాల్లో కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. తెలుగు వారి ఆత్మగౌరవంను చాటి చెప్పిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రస్తుతం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ గా బాలయ్య నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు శరవేగంగా తెరకెక్కుతోంది. సంక్రాంతికి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కాబోతుండగా - రిపబ్లిక్ డే కు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ విడుదలకు సిద్దం అవుతుంది. ఈ రెండు పార్ట్ లు కూడా బసవతారకం పాత్ర చుట్టు తిరిగేలా కథను డిజైన్ చేసినట్లుగా సమాచారం అందుతుంది.
సినిమాలో చాలా కీలకమైన బసవతారకం పాత్రకు గాను విద్యాబాలన్ ను ఎంపిక చేశారు. ఇప్పటికే ఆమె చిత్రీకరణలో పాల్గొంది. తాజాగా మరోసారి హైదరాబాద్ లో జరిగిన ‘ఎన్టీఆర్’ చిత్రీకరణలో పాల్గొంది. తాజా షెడ్యూల్ లో పెళ్లి ఎపిసోడ్స్ ను చిత్రీకరించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ - బసవతారకంల వివాహ సన్నివేశాలను చిత్రీకరించారు. అప్పటి పరిస్థితులను అచ్చు గుద్దినట్లుగా చూపించేందుకు సెట్ ను నిర్మించి - అందులో బాలయ్య - విద్యాబాలన్ ల వివాహ సన్నివేశాలను చిత్రీకరించారట.
పెళ్లి సీన్స్ తో పాటు విద్యాబాలన్ - రానా - హరికృష్ణలపై పలు సీన్స్ ను చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ గా బాలయ్య - చంద్రబాబు నాయుడుగా రానా - హరికృష్ణగా కళ్యాణ్ రామ్ ల లుక్ లు రివీల్ అయ్యాయి. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా - జయప్రద పాత్రను తమన్నాతో చేయించినట్లుగా తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు పార్ట్ లు కలిపి వంద కోట్ల వసూళ్లు సాధిస్తాయనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. బిజినెస్ పరంగా కూడా భారీతనం కనిపిస్తోంది.