Begin typing your search above and press return to search.
నందమూరి బ్రదర్స్.. నైటంతా బిజీ
By: Tupaki Desk | 15 Jun 2016 8:10 AM GMTనందమూరి సోదరులైన ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లు తమ కొత్త సినిమా షూటింగ్ లలో తెగ బిజీగా గడిపేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ మూవీలో ఎన్టీఆర్ నటిస్తుండగా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇంకా టైటిల్ డిసైడ్ చేయని చిత్రంలో కళ్యాణ్ రామ్ యాక్ట్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు రాత్రి పూటే షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికి రెండు రోజులుగా నైట్ షూట్ జరుగుతుండగా.. మరో వారం ఇదే పొజిషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గచ్చిబౌలి సమీపంలోని ఓ పబ్ లో జనతా గ్యారేజ్ కి సంబంధించిన పాటతో పాటు కొన్ని సీన్స్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. ఆ ప్రదేశానికి కాసింత దగ్గరలోనే ఉన్న నానక్ రామ్ గుడాలోని రామానాయుడు స్టూడియోస్ లో కళ్యాణ్ రామ్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆగస్ట్ 12న జనతా గ్యారేజ్ ని విడుదల చేసేందుకు ఎన్టీఆర్ డిసైడ్ కాగా.. దసరా పండుగ నాటికి కళ్యాణ్ రామ్ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కొరటాలతో చేస్తున్న సినిమాతో కెరీర్ బెస్ట్ కొట్టాలన్నది ఎన్టీఆర్ ఆలోచన కాగా.. పూరీతో సినిమా చేసి మళ్లీ ఫామ్ ను అందుకోవాలన్నది కళ్యాణ్ రామ్ ప్రయత్నం. మొత్తానికి ఇద్దరు నందమూరి హీరోలు రాత్రిపూట కూడా తెగ కష్టపడిపోతూ.. సినిమాలు ఫినిష్ చేసేస్తుండడం విశేషం.