Begin typing your search above and press return to search.
చెన్నైకి ఏం చేసినా తక్కువే -ఎన్టీఆర్
By: Tupaki Desk | 2 Dec 2015 12:09 PM GMTవరద బీభత్సం ఎంత వినాశనం సష్టించగలతో చెన్నై నగరాన్ని చూస్తే అర్ధమవుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ఆ మహానగరం పుట్టెడు కష్టంలో ఉంది. లక్షలాది మంది సాయం కోసం ఎదురుచూసే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో టాలీవుడ్ లో ఒక్కొక్కరు చెన్నైకు ఏదైనా చేసేందుకు ముందుకొస్తున్నారు
చైన్నై ఎదుర్కుంటున్న కష్టాన్ని చూసి చలించిపోయామని నందమూరి సోదరులు ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ అంటున్నారు. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం ప్రకటించారు. ఎన్టీఆర్ 10 లక్షల రూపాయలు అందించగా, కళ్యాణ్ రామ్ 5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపాడు. చెన్నైతో ఉన్న అనుబంధం.. ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న కష్టానికి చలించేలా చేసిందని అంటున్నారు.
"చెన్నై మహానగరం నుంచి వస్తున్న ఫోటోలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండాల్సిన సమయం ఇదే. ప్రతీ ఒక్కరూ స్పందించి శక్తి కొద్దీ విరాళాలు ఇచ్చి ఆదుకోవాలి. త్వరగా ఆ మహానగరం కోలుకోవాలని ఆశిస్తున్నామం"టున్నారు ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ సోదరులు.