Begin typing your search above and press return to search.
తాత పేరు నిలబెట్టడానికి అన్నకి అండగా నిలుస్తున్న తమ్ముడు..!
By: Tupaki Desk | 11 April 2020 2:01 PM GMTఇటీవల కాలంలో హీరోలు నిర్మాతలుగా మారి నచ్చిన కథలను సొంత ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు. అయితే వారిలో ఎవరో ఒకరు మాత్రమే సక్సెస్ అవుతుండగా ఎక్కువ శాతం చేతులు కాల్చుకున్న వారే. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలు నిర్మాతలుగా మారడం అన్నది కొత్త అంశమేమీ కాదు- తెలుగు చిత్రసీమ ఆరంభంలోనే యన్టీఆర్ - ఏయన్నార్ - కృష్ణ - కృష్ణంరాజు వంటివారు సొంతంగా ప్రొడక్షన్ హౌసెస్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మించిన వారే. తరువాతి జనరేషన్ లో చిరంజీవి - నాగార్జున లాంటివారు కూడా సొంత చిత్రాల్లో నటించి అలరించారు. అదే పంథాలో పయనించాలని ఈ జనరేషన్ టాప్ హీరో మహేశ్ బాబు కూడా భావించి 'ఎమ్.బి. - జి.మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్' పతాకంపై మహేశ్ సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసుకున్నాడు. మహేష్ బాబు నటించే ప్రతి సినిమాకు భాగస్వామిగా ఉంటూ వస్తున్నాడు. అలాగే నందమూరి ఫ్యామిలీ నుండి కూడా కళ్యాణ్ రామ్ తన తాత పేరు మీద 'ఎన్టీఆర్ ఆర్ట్స్'ను స్థాపించి చిత్రాలను నిర్మించాడు.
ఈ బ్యానర్ లో వచ్చిన 'అతనొక్కడే' - 'పటాస్' చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ ఇంతవరకు వాళ్ళ తాత పేరు నిలబెట్టే సరైన హిట్ లభించలేదనే చెప్పవచ్చు. ఒక మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఇతర హీరోలతోనూ చిత్రాలను నిర్మించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో తమ సంస్థని వెలుగులోకి తీసుకొచ్చిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా 'కిక్ - 2' సినిమాను నిర్మించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే తాత పేరు మీద పెట్టిన బ్యానర్ కావడం... ఇంతవరుకు బ్లాక్ బస్టర్ హిట్ లేకపోవడంతో ఎన్టీఆర్ కూడా అన్న కళ్యాణ్ రామ్ కు సహకరించేందుకు సిద్ధమవుతున్నాడట. అందుకోసం ఎన్టీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నాడని సమాచారం. ఇప్పటి నుండి ఈ బ్యానర్ లో ఎదైనా ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే స్వయంగా ఎన్టీఆర్ కి కంపల్సరీగా స్టోరీ నెరేషన్స్ ఇవ్వాలని కండిషన్ పెట్టుకున్నారట.
అంతేకాకుండా ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాకు హాసిని అండ్ హారిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుండగా దీంతో ఎన్టీఆర్ ఆర్ట్స్ ని కూడా భాగం చేసాడట. బయటి హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తూ ఎలాగైనా ఎన్టీఆర్ ఆర్ట్స్ ని నిలబెట్టాలని అన్నదమ్ములిద్దరూ గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఇదిలా ఉండగా ప్రస్తుతం 'డిస్కోరాజా'తో డిజాస్టర్ ని మూటగట్టుకొని ఇబ్బందుల్లో ఉన్న డైరెక్టర్ వి.ఐ. ఆనంద్ అవకాశం కోసం ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నట్లుగా సమాచారం. ఒకవేళ అన్నీ ఓకే అయితే ఈ బ్యానర్ లోనే ఎవరైనా బయట హీరోతో సినిమా చేయడానికి అన్నదమ్ములు ప్లాన్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ డిజాస్టర్ డైరెక్టర్ తో సినిమా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే.. వీ బిలీవ్ హిమ్ అని సమాధానం ఇస్తున్నారట. మరి రాబోయే ప్రాజెక్ట్స్ తో హిట్ కొట్టి ఆ బ్యానర్ ని నిలబెడతారేమో చూడాలి.