Begin typing your search above and press return to search.
NTR - కమల్ హాసన్ తో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రయోగం?
By: Tupaki Desk | 17 May 2022 3:59 AM GMTచూస్తుండగానే ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. ఇటు సౌత్ ఓవర్సీస్ తో పాటు అటు హిందీ రాష్ట్రాల మార్కెట్ ని కొల్లగొట్టడం ఎలానో అతడు చూపించాడు. శంకర్- రాజమౌళి తర్వాత మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల జాబితాలో అతడి పేరు కూడా చేరింది. మాఫియా కాన్సెప్టులతో మ్యాజిక్ చేయడ ఎలానో కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో అతడు నిరూపించిన తీరు అసమానం.
అలాంటి గొప్ప డైరెక్టర్ తో ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత భారీగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో దీపిక పదుకొనే కథానాయికగా నటిస్తుందన్న గుసగుస కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా కన్ఫర్మేషన్ కావాల్సి ఉంది.
ఎన్టీఆర్ నటిస్తున్న కెరీర్ 31వ సినిమాలో విశ్వనటుడు కమల్ హాసన్ ని ఓ కీలక పాత్రలో ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్న గుసగుస వేడెక్కిస్తోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ - కమల్ హాసన్ కాంబినేషన్ కి ఉండే క్రేజ్ అసాధారణంగా ఉంటుందనడంలో సందేహం లేదు. విశ్వనటుడి పాత్ర తీరు తెన్నులు కూడా మూవీ రేంజును అమాంతం పెంచేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఆ ఇద్దరి నటన స్టార్ డమ్ ఈ మూవీకి పెద్ద ప్లస్ కానుంది.
ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ అక్టోబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. అప్పటికి ప్రశాంత్ నీల్ సలార్ చిత్రీకరణను పూర్తి చేస్తారు. ఇక ఎన్టీఆర్ - కమల్ హాసన్ లాంటి అగ్ర తారలను కలుపుతూ తెరకెక్కించే ఈ సినిమా కథాంశం ఎలా ఉండనుందో అంచనా వేసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
అయితే ఈ ప్రాజెక్ట్ పై ప్రతిదీ అధికారికంగా తెలియాల్సి ఉంటుంది. ఇక కేజీఎఫ్ ఫ్రాంఛైజీ తర్వాత ప్రభాస్ తో సలార్ ని మరో రేంజులో తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ తారక్ కోసం అంతకుమించి అనేలా కాన్సెప్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో తారక్ అభిమానుల నుంచి ప్రశాంత్ నీల్ పై ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు.
ప్రభాస్- యష్ కాంబినేషన్?
మరోవైపు ప్రశాంత్ నీల్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ తరహాలో మల్టీవర్స్ సినిమాల నిర్మాణానికి అతడు రూపకల్పన చేస్తున్నారన్న టాక్ వేడెక్కిస్తోంది. కేజీఎఫ్ ఫ్రాంఛైజీకి సలార్ ని ముడి వేసి క్రాస్ ఓవర్ కాన్సెప్టుల్ని డిజైన్ చేసి అందులో ప్రభాస్ - యష్ లను కలిపి భారీ చిత్రాలకు తెర తీస్తారన్న టాక్ అభిమానుల్ని నిలువనీయడం లేదు.
ఇదే జరిగితే సౌత్ మరో లెవల్ కి వెళ్లడం ఖాయంగా ముచ్చట సాగుతోంది. ఇన్నాళ్లు 1000 కోట్లు.. ఇకపై 2000 కోట్లు సునాయాసంగా తెచ్చే గట్టి ప్లాన్ ని చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ నుంచి భారీ వసూళ్లను రాబట్టేందుకు రకరకాల ఎత్తుగడల్ని అనుసరించడం ఇటీవలి కాలంలో మరీ ఎక్కువైంది. రాజమౌళి - ప్రశాంత్ నీల్ ఇందులో పెద్ద సక్సెసయ్యారు.