Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : సతీసమేతంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి కన్నుల విందు

By:  Tupaki Desk   |   17 Dec 2022 5:05 AM GMT
పిక్ టాక్ : సతీసమేతంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి కన్నుల విందు
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటూ ఉంటారు. కానీ ఎన్టీఆర్‌ మాత్రం చాలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సోషల్‌ మీడియా లో పోస్ట్‌ లు పెడుతూ ఉంటాడు.. ఫొటోలు షేర్‌ చేస్తూ ఉంటాడు. తాజాగా ఎన్టీఆర్ ఈ ఫొటోను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఎన్టీఆర్ యొక్క కొత్త లుక్ ఇటీవలే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇప్పుడు భార్య లక్ష్మి ప్రణతితో ఉన్న ఎన్టీఆర్‌ ఫొటో ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్ పై వైరల్ అవుతున్నాయి. నెట్టింట సందడి చేస్తున్న ఈ ఫొటో ను అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తున్నారు.

సినిమాలతో బిజీగా ఉన్నా కూడా భార్య లక్ష్మి ప్రణతి కి మరియు ఇద్దరు కొడుకులకు సాధ్యం అయినంత ఎక్కువ సమయం కేటాయిస్తూ వారితో క్వాలిటీ టైమ్ ను గడుపుతూ ఉంటాడు. అలాంటి ఎన్టీఆర్‌ ఈ ఫొటోను షేర్‌ చేయడం అభిమానులకు కన్నుల విందు అన్నట్లుగా ఉంది. భార్య పై ఎన్టీఆర్‌ కు ఉన్న ప్రేమకు ఈ ఫొటో ప్రత్యక్ష సాక్ష్యం అనడంలో సందేహం లేదు.

ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే ఆర్‌ఆర్ఆర్ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్‌ చేయాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.