Begin typing your search above and press return to search.
మహేష్-ఎన్టీఆర్.. సీన్ రివర్స్
By: Tupaki Desk | 3 March 2018 2:08 PM GMTఈ మధ్య తెలుగు దర్శకులు సినిమాటోగ్రాఫర్ల విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. కొరటాల శివ అన్నట్లుగా.. సినిమా కొంచెం అటు ఇటు అయినా మంచి టెక్నీషియన్లు ఉంటే వాళ్లు దాన్ని నిలబెట్టగలరనే విషయాన్ని చాలామంది దర్శకులు నమ్ముతున్నారు. తమ సినిమాలకు కొత్త కలర్ తెచ్చేందుకు.. ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ ఇచ్చేందుకు టాప్ క్లాస్ సినిమాటోగ్రాఫర్లను ఎంచుకుంటున్నారు.
ఈ కోవలోనే మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్ ల కొత్త సినిమాలకు మంచి పేరున్న ఛాయాగ్రాహకుల్ని ఎంచుకున్నారు. బాలీవుడ్లో ‘డాన్’.. ‘రయీస్’.. ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన మోహనన్.. మహేష్-వంశీ పైడిపల్లి సినిమాకు ఛాయాగ్రహణం అందించబోతున్న సంగతి తాజాగా వెల్లడైన సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ‘మనం’.. ‘ఊపిరి’.. ‘ధృవ’.. ‘విక్రమ్ వేద’ లాంటి సినిమాలకు పని చేసిన పి.ఎస్.వినోద్ ను ఎంచుకున్నారు.
ఇక్కడ విశేషం ఏంటంటే.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ముందు మోహనన్ ను ఛాయగ్రాహకుడిగా అనుకున్నారట. ఆల్మోస్ట్ ఫైనలైజ్ కూడా చేశారట. మరోవైపు మహేష్-వంశీ సినిమాకు వినోద్ ను సంప్రదించారట. అక్కడ కూడా అంగీకారం కుదిరిందట. కానీ ఎందుకో ఈ కాంబినేషన్లు వర్కవుట్ కాలేదు. ఆ సినిమాటోగ్రాఫర్ ఇటు.. ఈ సినిమాటోగ్రాఫర్ అటు మారాడు. అలాగని రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తోంది ఒకే సంస్థ కాదు. ఇంకే రకంగానూ రెండు సినిమాలకు సంబంధం లేదు. మరి ఈ మార్పిడి ఎలా జరిగిందో ఏమో?