Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ - మహేష్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా ఫైట్‌

By:  Tupaki Desk   |   27 Aug 2018 6:14 AM GMT
ఎన్టీఆర్‌ - మహేష్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా ఫైట్‌
X
తెలుగులో పలువురు హీరోలకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూస్తే మతి పోవాల్సిందే. తమ అభిమాన హీరోలను ఎవరైనా ఏదైనా అంటే వారిపైకి కత్తులు దూసే వరకు అభిమానులు వెళ్లడం అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా సహజంగా చూస్తూనే ఉన్నాం. గతంలో అభిమానుల మద్య గొడవలు అవ్వడం, కొట్టుకోవడం వరకు వెళ్లేది. కాని ప్రస్తుతం గొడవలు సోషల్‌ మీడియాలో అవుతున్నాయి. అభిమానులకు అభిమానులకు మద్య గొడవలు తారా స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా స్టార్‌ హీరోల అభిమానులు చిన్న చిన్న కారణాలతో ఇతర హీరోలను - ఇతర హీరోల అభిమానులను దుమ్మెత్తి పోవడం ఈమద్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం.

చాలా కాలంగా నందమూరి ఫ్యాన్స్‌కు మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కు మద్య సోషల్‌ మీడియా వార్‌ జరుగుతూ ఉంది. భరత్‌ అనే నేను చిత్రం వేడుకలో ఎన్టీఆర్‌ పాల్గొనడంతో పాటు మేము మేము కలిసి ఉంటాం - మంచి స్నేహితులం - మీరు ఎందుకు గొడవ పడతారు అంటూ అభిమానులను సున్నితంగా హెచ్చరించాడు. ఆ తర్వాత కూడా పలు సార్లు మహేష్‌ బాబు -ఎన్టీఆర్‌ లు కలిసి పలు పార్టీల్లో పాల్గొనడం - ఎంజాయ్‌ చేయడం జరిగింది. అయినా కూడా ఫ్యాన్స్‌ మద్య వైరం మాత్రం అలాగే ఉన్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా విజయ్‌ దేవరకొండ చేసిన ఒక ట్వీట్‌ కు మహేష్‌ బాబు స్పందించడం జరిగింది. అయితే ఎన్టీఆర్‌ ఆగస్టు 9న మహేష్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేయడం జరిగింది. ఆ ట్వీట్‌ కు మాత్రం మహేష్‌ రెస్పాన్స్‌ ఇవ్వలేదు.

ఇప్పుడు ఈ కారణంతో మహేష్‌ బాబును నందమూరి ఫ్యాన్స్‌ టార్గెట్‌ చేస్తున్నారు. ఒక చెత్త హ్యాష్‌ ట్యాగ్‌ తో మహేష్‌ పరువును తీస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు చేస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్‌ చేస్తున్న పనికి కౌంటర్‌ గా మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కూడా కొన్ని ట్రోల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరి ఫ్యాన్స్‌ మద్య ఈ ఇద్దరు హీరోలు నలిగి పోతున్నారు. ఇద్దరు మంచి స్నేహితులే అయినప్పటికి ఫ్యాన్స్‌ కారణంగా వీరు శత్రువులు అవుతున్నారు. వారు బాగున్నప్పుడు ఫ్యాన్స్‌ కు ఎందుకు ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయో వారే నిర్ణయించుకోవాలి.