Begin typing your search above and press return to search.
ఒక్కో హీరోకి దిమ్మదిరిగిపోతోందిగా..
By: Tupaki Desk | 24 Oct 2015 11:30 AM GMTఅంతే మరి.. ప్రేక్షకుడిని మరీ తక్కువగా అంచనా వేస్తే, అతణ్ని చులకన చేసి సినిమాలు తీస్తే.. అలాగే ఉంటుంది. ఒక్క పంచ్ ఇచ్చాడంటే మళ్లీ కోలుకోవడం కష్టం. ‘1 నేనొక్కడినే’ అంటూ ఓ డిఫరెంట్ మూవీలో నటించాడు మహేష్ బాబు. ఐతే తాను ఓ భిన్నమైన సినిమాలో నటిస్తున్నాననే ఇండికేషన్ ఇవ్వలేదు. మీరు చూడబోయేది ఈ టైపు సినిమా అని ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేయడంలో ఫెయిలైంది ‘1’ టీమ్. దీంతో ఏదో అనుకుని థియేటరుకి వచ్చిన ప్రేక్షకుడు ఇంకేదో చూసి పెదవి విరిచాడు. సినిమా ఫ్లాపైంది. అంత మాత్రాన కొత్తగా చేస్తే చూడరా అంటూ ప్రేక్షకులకు రిటార్ట్ ఇద్దామన్నట్లు సినిమా చేస్తే ఏమవుతుంది. ‘ఆగడు’లా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ‘ఆగడు’ చేయడంలో మహేష్ బాబు ఫీలింగేంటో కానీ.. జనాలు మాత్రం అదోలా ఫీలయ్యారు. సినిమాను తిప్పికొట్టారు. దెబ్బకు దారికొచ్చి ‘శ్రీమంతుడు’ లాంటి భిన్నమైన, మంచి సినిమా చేశాడు మహేష్. పనిలో పనిగా ‘ఆగడు’ తాను చేసిన పెద్ద మిస్టేక్ అంటూ తప్పు ఒప్పుకున్నాడు.
మహేష్ కు మాత్రమే కాదు.. ప్రేక్షకుల తెలివిని తక్కువగా అంచనా వేసి.. లాజిక్ లేకుండా, పరమ రొటీన్ గా సినిమాలు తీసిన చాలామంది హీరోలకు దిమ్మదిరిగిపోయింది. ‘రభస’ సినిమాతో ఎన్టీఆర్ కూడా ఇలాగే దెబ్బతిన్నాడు. ఆ తర్వాత జ్నానోదయం అయి ‘టెంపర్’ లాంటి కథాబలమున్న, భిన్నమైన సినిమా చేశాడు. ఇప్పుడు చేస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ కూడా భిన్నమైన సినిమానే. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుడిని తక్కువగా అంచనా వేసిన మరో ముగ్గురు హీరోలకు పంచ్ పడింది. ‘కిక్-2’తో రవితేజ - ‘శివమ్’తో రామ్ - ‘బ్రూస్ లీ’తో రామ్ చరణ్ గట్టి ఎదురు దెబ్బలే తిన్నారు. ఐతే వీళ్లందరూ కూడా మహేష్ - ఎన్టీఆర్ ల మాదిరే పాఠాలు నేర్చకుని భిన్నమైన దారిలో నడుస్తారేమో చూడాలి.