Begin typing your search above and press return to search.

వార‌సుడి ప‌సి జ్ఞాప‌కాలు మ‌దిలో

By:  Tupaki Desk   |   17 Dec 2018 7:05 PM GMT
వార‌సుడి ప‌సి జ్ఞాప‌కాలు మ‌దిలో
X
అప్పుడే జ‌న్మించిన బిడ్డ‌కు సంబంధించిన చేతి వేలి ముద్ర‌లు.. కాలి బొట‌న వేలి ముద్ర‌లు.. పాద ముద్ర‌.. చేతి ముద్ర‌లు.. వంటి వాటిని ప్రింటుగా సేక‌రించ‌డం.. ఆ జ్ఞాప‌కాల్ని మ‌దిలో శాశ్వ‌తంగా ప‌దిల‌ప‌రుచుకునేందుకు వాటిని ఫోటో ఫ్రేములుగా క‌ట్టి ఇళ్ల‌లో ఉంచుకోవ‌డం ఒక ట్రెండ్‌గా కొన‌సాగుతోంది. సామాన్యుల‌కు ఇలాంటి వి కొంత క‌ష్ట‌మే అయినా, సెల‌బ్రిటీల ఇళ్ల‌లో ఇవ‌న్నీ చాలా కామ‌న్.

తాజాగా అలాంటి ప్లాన్‌నే చేశారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - ల‌క్ష్మి ప్ర‌ణ‌తి జోడీ. త‌మ వార‌సుడికి సంబంధించిన‌ తొలి ఇంప్రెష‌న్స్ (ముద్ర‌లు)ను సేక‌రించారు. వాటిని ఫోటో ఫ్రేములుగా డిజైన్ చేసి అందించ‌డంలో స్పెష‌లిస్టు అయిన‌ ప్ర‌ఖ్యాత భావ‌న జాస్రా ఎక్స్‌ప‌ర్ట్ ను సంప్ర‌దించారు. న‌గ‌రంలో ఈ త‌ర‌హా ఆర్ట్‌ల భావ‌న చాలా ఫేమ‌స్. త‌న‌ని ఫ‌స్ట్ ఇంప్రెష‌న్స్ (తొలి) భావ‌న జ‌స్రా అని పిలిచేస్తుంటారు.

తార‌క్ రెండో కుమారుడు మాష్ట‌ర్ భార్గ‌వ్ రామ్‌కి సంబంధించిన వేలి ముద్ర‌ల్ని .. పాదాలు, చేతి వేళ్ల ముద్ర‌ల్ని సేక‌రించి వాటిని ర‌క‌ర‌కాల ప్రింట్లుగా డిజైన్ చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ని క‌లిసిన‌ ఎన్టీఆర్ తో భావ‌న ఫోటో దిగారు. ఆ ఫోటో స‌హా, ఫస్ట్ ఇంప్రెష‌న్స్ కు సంబంధించిన కొన్ని పోటోల్ని భావ‌న అభిమానుల‌కు షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఇవి ఎన్టీఆర్ అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి.