Begin typing your search above and press return to search.

జక్కన్న.. తారక్ కేరాఫ్ బల్గేరియా

By:  Tupaki Desk   |   11 Oct 2019 1:18 PM GMT
జక్కన్న.. తారక్ కేరాఫ్ బల్గేరియా
X
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' షూటింగ్ బల్గేరియాలో జోరుగా సాగుతోంది. 'సైరా' రిలీజ్.. ప్రమోషన్స్ హడావుడి ఉన్నందువల్ల చరణ్ ఇండియాలోనే ఉన్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం బల్గేరియాలో షూటింగ్ తో బిజీగా గడుపుతున్నారు. తాజాగా 'RRR' షూటింగ్ లొకేషన్ నుంచి ఒక పిక్ బయటకు వచ్చింది.

ఈ ఫోటోలో ఎన్టీఆర్.. రాజమౌళి మరో వ్యక్తితో కలిసి ఒక ఫారెస్ట్ లొకేషన్ లో పోజిచ్చారు. రాజమౌళి స్కల్ క్యాప్.. ఫుల్ స్లీవ్స్ టీ షర్టు - జీన్స్ లో సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ చాలా స్లిమ్ గా కనిపిస్తున్నారు. బ్లాక్ టీ షర్టు జీన్స్ లో యంగ్ గా ఉన్నారు. గుబురు మీసాలు గడ్డంతో ఎన్టీఆర్ గెటప్ డిఫరెంట్ గా ఉంది. 'RRR' సినిమాకు సంబంధించిన ఏ విషయం అయినా క్షణాల్లో వైరల్ అవుతుందని తెలిసిందే కదా. సినిమా షూటింగుకు సంబంధించినవే కాదు. ఆన్ లొకేషన్ లో ఫోటోలు కూడా వెంటనే వైరల్ అవుతున్నాయి,.

ఇదిలా ఉంటే నిన్న రాజమౌళి తన పుట్టినరోజును జరుపుకున్నారు. అటు అభిమానులనుంచి ఇటు సెలబ్రిటీల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో కూడా జక్కన్న బర్త్ డే హంగామా కనిపించింది.