Begin typing your search above and press return to search.

దోస్త్ మేరా దోస్త్.. తార‌క‌-రామ దోస్తీ!

By:  Tupaki Desk   |   4 Aug 2019 6:28 AM GMT
దోస్త్ మేరా దోస్త్.. తార‌క‌-రామ దోస్తీ!
X
వ‌రుస విజ‌యాల‌తో స్పీడ్ మీదున్న యంగ్ య‌మ ఎన్టీఆర్ కి బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు .. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కి ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్. ఈ విష‌యాన్ని నేడు స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా తార‌క్ స్వ‌యంగా అభిమానుల‌తో షేర్ చేసుకోవ‌డ‌మే కాదు.. త‌న స్నేహితుడు రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫోటోను జోడిస్తూ.. ``స్నేహం ఎంపికలో నెమ్మదిగా వ్యవహరించండి. కానీ ఒక్కసారి స్నేహం చేస్తే ఎప్పటికీ వారితో బలమైన బంధాన్ని కొనసాగించండి`` అంటూ తార‌క్ అద్భుత‌మైన కోట్ ని జ‌త చేశారు. సోక్ర‌టీస్ కోట్ ఈ స్నేహితులకు అద్భుతంగా కుదిరింది. అందుకే తార‌క్ కాస్తంత ఎమోష‌న‌ల్ గా.. ``మా స్నేహం గురించి చెప్పడానికి మరో వాక్యం లేదు`` అని అన్నారు. తార‌క్-చ‌ర‌ణ్‌- రాజ‌మౌళి కాంబినేష‌న్ లో ఆర్.ఆర్.ఆర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

మ‌రి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రు? అంటే ఆయ‌నే స్వ‌యంగా రివీల్ చేశారు. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా రాజ‌మౌళి త‌న స్నేహితుడి గురించి రివీల్ చేశారు. వారాహి చలనచిత్రం అధినేత.. నిర్మాత సాయి కొర్రపాటితో దిగిన‌ ఫోటోను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసిన రాజ‌మౌళి.. దానికి ఆస‌క్తిక‌ర ట్యాగ్ ని జోడించారు. ``విధి అనుకూలిస్తేనే సాయిగారి లాంటి వ్యక్తిని కలిస్తాం. చిన్నపిల్లాడి మనస్తత్వం.. నమ్మకానికి రూపం.. వెన్నంటి ఉండే బలం. ఆయన నా భీమ్‌. ఆయన ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నా`` అంటూ వ్యాఖ్య‌ను జోడించారు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ యే దోస్తీ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ని జ‌త చేశారు.

కేవ‌లం వీళ్లే కాదు .. ప్ర‌భాస్ - మ‌హేష్ వంటి స్టార్లు క్లోజ్ ఫ్రెండ్స్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌భాస్ కి ప్ర‌మోద్- వంశీ అనే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ల మ‌ధ్య‌నా స్నేహితుల దినోత్స‌వ శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. మ‌రోవైపు ప‌రిశ్ర‌మ‌లో ది బెస్ట్ సెల‌బ్రిటీలంతా త‌మ స్నేహితుల‌కు నేటి ఫ్రెండ్ షిప్ డేని పుర‌స్క‌రించుకుని సామాజిక మాధ్య‌మాల్లో శుభాకాంక్ష‌లు చెబుతుండ‌డం ఆస‌క్తిక‌రం.