Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ తో కలసి రకుల్ 'బెస్ట్' అవార్డ్

By:  Tupaki Desk   |   1 July 2017 4:23 AM GMT
ఎన్టీఆర్ తో కలసి రకుల్ బెస్ట్ అవార్డ్
X
అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో పాగా వేసేందుకు ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. అందుకే అవకాశాలు.. ఆఫర్ల సంఖ్య పెరగగానే హైద్రాబాద్ లో సొంతిల్లు కొనేసుకుని మరీ సెటిల్ అయిపోయిన రకుల్.. ఇప్పుడు స్టార్ గా ఎదగడం అనే లక్ష్యంతో దూసుకుపోతోంది.

భారీ బడ్జెట్ చిత్రాలు.. స్టార్ హీరోలతో ప్రాజెక్టులు.. బ్లాక్ బస్టర్లు.. అన్నీ అమ్మడి ఖాతాలో ఉన్నా ఇంకా ఎందుకో రకుల్ ని స్టార్ అని అనడం లేదు ఇండస్ట్రీ జనాలు. ధృవ.. రారండోయ్ వేడుక చూద్దాం వంటి చిత్రాలతో తన యాక్టింగ్ ప్రతిభను కూడా చూపించిన రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ లో.. ఇప్పుడో అద్భుతమైన సందర్భం చోటు చేసుకుంది. అబుదాబిలో జరుగుతున్న ఈ ఏడాది సైమా అవార్డుల వేడుకలో.. రకుల్ ప్రీత్ సింగ్ కు ఉత్తమనటి అవార్డు దక్కడం విశేషం. ఎన్టీఆర్ తో కలిసి నాన్నకు ప్రేమతో చిత్రంలో ప్రదర్శించిన నటనా ప్రతిభకు గాను రకుల్ కు ఈ పురస్కారం లభించింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకోవడంతో.. అమ్మడి కళ్లలో మెరుపులు మామూలుగా లేవు.

ఇకపోతే నాన్నకు ప్రేమతో చిత్రంలో హీరోగా నటించిన ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావడం విశేషం. కాకపోతే.. జనతా గ్యారేజ్ చిత్రానికి గాను ఈ అవార్డ్ లభించింది. ఇక బెస్ట్ ఫిలింగా పెళ్లిచూపులు మూవీ నిలవగా.. ఈ సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ కు.. బెస్ట్ డైరెక్టర్(డెబ్యూ) అవార్డ్ దక్కింది. బెస్ట్ డైరెక్టర్ అవార్డును ఊపిరి చిత్రానికి గాను వంశీ పైడిపల్లి దక్కించుకున్నాడు.

ఇక విన్నర్ల లిస్టు చూస్తే ఇలా ఉంది..

ఉత్తమ చిత్రం.. పెళ్ళి చూపులు

ఉత్తమ నటుడు.. ఎన్టీఆర్ (జనతా గారేజ్)

ఉత్తమ నటి.. రకుల్ ప్రీత్ సింగ్ (నాన్నకు ప్రేమాతో)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్).. నాని

ఉత్తమ దర్శకుడు.. వంశీ పైడిపల్లి (ఊపిరి)

ఉత్తమ దర్శకుడు (డెబ్యూ).. తరుణ్‌ భాస్కర్ (పెళ్ళి చూపులు)

ఉత్తమ నటుడు (డెబ్యూ)... రోషన్ (నిర్మల కాన్వెంట్)

ఉత్తమ నటి (డెబ్యూ)... నివేతా థామస్ (జెంటిల్మాన్)

ఉత్తమ సహాయ నటుడు.. శ్రీకాంత్ (సరైనోడు)

ఉత్తమ సహాయ నటి.. అనసూయ భరద్వాజ్ (క్షణం)

ఉత్తమ హాస్యనటుడు.. ప్రియదర్శి (పెళ్ళి చూపులు)

ఉత్తమ నటుడు (నెగెటివ్ రోల్).. జగపతి బాబు

ఉత్తమ సంగీత దర్శకుడు.. దేవి శ్రీ ప్రసాద్ (జనతా గారేజ్)

ఉత్తమ పాటల రచయిత.. రామజోగయ్య శాస్త్రి (ప్రణామం.. జనతా గారేజ్)

ఉత్తమ నేపథ్య గాయకుడు (మేల్).. సాగర్ (శైలజా శైలజా.. నేను శైలజ)

ఉత్తమ నేపధ్య గాయిని.. రమ్య బెహరా (రంగ్ దే.. ఆ.ఆ)

లైఫ్ టైమ్ అచీవ్మెంట్.. మురళి మోహన్

40 సంవత్సరాలు పూర్తిచేసిన పురస్కారం.. మోహన్ బాబు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/