Begin typing your search above and press return to search.

ఆర్ ఆర్ ఆర్ అప్డేట్ : ఇద్దరు హీరోలు ఎక్కడ ?

By:  Tupaki Desk   |   3 Sep 2019 7:53 AM GMT
ఆర్ ఆర్ ఆర్ అప్డేట్ : ఇద్దరు హీరోలు ఎక్కడ ?
X
ఆర్ ఆర్ ఆర్ గురించి ఎలాంటి అప్డేట్స్ రాక ఈ మధ్య రామ్ చరణ్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు. దానికి తోడు ప్రొడక్షన్ హౌస్ డివివి పేరు మీద రాంగ్ క్యాస్టింగ్ కాల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. దీనికి నిర్మాతలే చెక్ పెట్టడం విశేషం. ప్రస్తుతం బల్గెరియాలో తారక్ తో కీలకమైన ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నామని రామ్ చరణ్ త్వరలో కాబోయే షెడ్యూల్ కోసం ట్రైన్ అవుతున్నాడని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది.

సో ఇద్దరు హీరోలు ఒకేచోట ప్రస్తుతానికి లేరన్న మాట. జూనియర్ తో చిత్రీకరిస్తున్న సన్నివేశాల గురించి ఎలాంటి లీక్స్ రాకుండా జాగ్రత్త పడుతున్న టీం ఫైనల్ గా కొంత రిలీఫ్ అయితే ఇచ్చింది. తారక్ చరణ్ ల స్టేటస్ గురించి అఫీషియల్ ఇన్ ఫర్మేషన్ వచ్చేసింది కాబట్టి ఫ్యాన్స్ ఇక ఆందోళన చెందాల్సిన పని లేదు. మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ మీద ఇప్పటికే జాతీయ స్థాయిలో అటెన్షన్ ఉంది.

వచ్చే ఏడాది జూలై 30 రిలీజ్ డేట్ ఆల్రెడీ ప్రకటించేసారు కాబట్టి దానికే కట్టుబడి ఉండాలని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ సరసన అలియా భట్ ఇప్పటికే ఫిక్స్ అయిపోగా జూనియర్ పక్కన జోడిని ఇంకా అధికారికంగా ప్రకటించనే లేదు. బల్గేరియా నుంచి తిరిగి వచ్చాక ఏమైనా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఆర్ ఆర్ ఆర్ మీద ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని దాటుతున్నాయి. ఇక ప్రమోషన్ మొదలుపెడితే ఎక్కడికి చేరతాయో వేరే చెప్పాలా.