Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ - చరణ్ కాఫీ తాగుతూ
By: Tupaki Desk | 24 Sep 2019 7:05 AM GMTప్రస్తుతం 'గద్దలకొండ గణేష్' గా సందడి చేస్తున్న వరుణ్ తేజ్ లేటెస్ట్ గా సక్సెస్ మీట్ లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు ముందుగా వాల్మీకి అనుకొని రేపు విడుదల అనగా మళ్లీ టైటిల్ మార్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఆ సమయంలో వరుణ్ కి ఏం చేయాలో తెలియక ఏ సమస్య వచ్చినా చరణ్ తో చేర్పుకోవడం అలవాటు కనుక వెంటనే చరణ్ కి కాల్ చేశాడట. చరణ్ అన్నా అంటూ విషయం చెప్పగానే వెంటనే ఇంటికి రమ్మని పిలిచాడంట. తీరా వరుణ్ ఇంటికి వెళ్తేసరికి చరణ్ ఎన్టీఆర్ కలిసి కూర్చుని కాఫీ తాగుతున్నారట. ఇక వారిద్దరితో గడిపాక టెన్షన్ పోయిందని, నా స్ట్రెస్ లెవెల్ జీరో కి వచ్చేసిందని లేటెస్ట్ గా సక్సెస్ మీట్ లో చెప్పుకున్నాడు వరుణ్. సో తారక్ - చరణ్ ల బాండింగ్ అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఆ సాన్నిహిత్యంతోనే తరుచూ షూటింగ్ లేని సందర్భాల్లో కూడా కలుస్తున్నారు. ఆ సమయంలోనే వరుణ్ అలా వారి దగ్గరికి వెళ్లి టైటిల్ వివాదాన్ని మర్చిపోయి ఇద్దరితో కలిసి ఎంజాయ్ చేసాడు.
ఇక తన బాబాయ్ తో 'గబ్బర్ సింగ్' చేసిన దర్శకుడు తనతో ఓ సినిమా చేస్తాడని ఎన్నడూ ఊహించలేదని - అసలు ఆలోచన కూడా రాలేదని తెలిపాడు. ఇక సినిమా పిచ్చ వల్లే ఇద్దరం బాగా కలిసిపోయామని - గద్దల కొండ గణేష్ క్యారెక్టర్ ని నేను చేస్తే బాగుంటుందని నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ హరీష్ గురించి మాట్లాడాడు వరుణ్.