Begin typing your search above and press return to search.

అదే జ‌రిగితే ఎన్టీఆర్ తో క‌లిసి చ‌ర‌ణ్ ఆ ప‌ని చేస్తాడ‌ట‌

By:  Tupaki Desk   |   14 Jan 2023 1:30 AM GMT
అదే జ‌రిగితే ఎన్టీఆర్ తో క‌లిసి చ‌ర‌ణ్ ఆ ప‌ని చేస్తాడ‌ట‌
X
జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన పాన్ ఇండియా సంచ‌ల‌నం RRR. తెలుగు సినిమా స‌త్తాని విశ్వ వ్యాప్తం చేసిన ఈ మూవీ ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై పలు పుర‌స్కారాల్ని ద‌క్కించుకున్న ఈ మూవీ తాజాగా హాలీవుడ్ న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డెన్ గ్లోబ్ 80వ అవార్డులు వేడుక‌ల్లో బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో పోటీప‌డి `నాటు నాటు` పాట‌కు గానూ గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఆస్కార్ అకాడ‌మీ అవార్డుల్లోనూ RRR ఖ‌చ్చితంగా స‌త్తా చాటుతుంద‌ని అభిమానులు గ‌ట్టిగానే కోరుకుంటున్నారు. అభిమానుల‌తో పాటు ఇండియ‌న్ సినీ ల‌వ‌ర్స్ అంతా కూడా ముక్త కంఠంతో ఇదే కోరుకుంటున్నారు. ఈ మూవీ ఆస్కార్ బ‌రిలో రీసెంట్ గా షార్ట్ లిస్ట్ అయిన ద‌గ్గ‌రి నుంచి అభిమానులు పెద్ద ఎత్తున నెట్టింట #Oscar for RRR అంటూ నెట్టింట ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే గోల్డెల్ గ్లోబ్ అవార్డుల వేదిక‌పై అవార్డు అందుకున్న క్ష‌ణం ఈ పాట‌ని ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ పెర్ఫార్మ్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆస్కార్ వేదిక‌పై అయినా ఇద్ద‌రు హీరోలు `నాటు నాటు` పాట‌ని స్టేజ్ పై పెర్ఫార్మ్ చేస్తే చూడాల‌ని అభిమానులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. 95వ ఆస్కార్ అవార్డుల‌కు గానూ `నాటు నాటు` సాంగ్ షార్ట్ లిస్ట్ కావ‌డంతో RRR ఆస్కార్ బ‌రిలో నిలవ‌డం తెలిసిందే. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో అట్ట‌హాసంగా ఆస్కార్ అవార్డుల వేడుక జ‌ర‌గ‌బోతోంది.

ఈ నెల 24న ఈ మూవీ ఆస్కార్ భ‌విత్వం తేల‌నున్న నేప‌థ్యంలో హీరో రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. RRR ఆస్కార్ గెలుచుకుంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి స్టేజ్ పై దుమ్ముదులుపుతామ‌ని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. RRR ఆస్కార్ అవార్డు ల‌భిస్తే ఖ‌చ్చితంగా 17 సార్లు ఎన్టీఆర్ తో క‌లిసి డ్యాన్స్ చేస్తాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో రామ్ చ‌ర‌ణ్ వెల్ల‌డించాడు. అదే ఇప్పుడు నెట్టింట ఫ్యాన్స్ వైర‌ల్ చేస్తున్నారు.

ప్రేమ్ ర‌క్షిత్ డ్యాన్స్ కంపోజ్ చేసిన ఈ పాట‌కు చంద్ర‌బోస్ సాహిత్యం అందించ‌గా కీర‌వాణి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. రాహుల్ సిప్లిగంజ్‌, కాల‌భైర‌వ ఆల‌పించారు. అయితే ఈ పాట కోసం చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ 17 టేక్ లు తీసుకున్నార‌ట‌. ఇదిలా వుంటే ప్ర‌తిష్టాత్మ‌క్ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో భారీ స్థాయిలో జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.