Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - రవితేజ ఆడేసుకున్నారు

By:  Tupaki Desk   |   25 Jan 2018 8:34 AM GMT
ఎన్టీఆర్ - రవితేజ ఆడేసుకున్నారు
X
మొన్న సంక్రాంతికి థియేటర్లలో సినిమాల సందడి ఏమో కాని బుల్లితెరపై మాత్రం ఓ రేంజ్ లో రచ్చ జరిగింది. పోటీ పడి మరీ కొత్త సినిమాలు ప్రసారం చేయటంతో టీవీ ప్రేక్షకులు మాత్రం ఇంట్లోనే పండగ చేసుకున్నారు. కాకపోతే ఎవరికి ఏ సినిమాకు ఎక్కువ రేటింగ్స్ వస్తాయి అనే దాని గురించి మాత్రం ఆయా ఛానళ్ళ యాజమాన్యాలు భారీ అంచనాలే పెట్టుకున్నాయి. పండగకు వారం ముందు నుంచే జరిగిన సినిమాల మేళ కు సంబంధించిన టిఆర్పి రేటింగ్స్ వచ్చేసాయి. జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ 17.7 రేటింగ్ తో అదరగొట్టగా రవితేజ నేనేమి తక్కువ తినలేదు అంటూ రాజా ది గ్రేట్ తో అంతే సమానమైన 17.7తో మొదటిసారి తన సినిమా టీవీ రేటింగ్స్ లో బెస్ట్ తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ గతంలో తెచ్చుకున్న జనతా గ్యారేజ్(20.69)కంటే జై లవకుశ తక్కువే తెచ్చుకున్నప్పటికీ జనతా గ్యారేజ్ విడుదలైన 52వ రోజే టెలికాస్ట్ అయ్యిందన్న సంగతి మర్చిపోకూడదు.

ఇక మహేష్ బాబు స్పైడర్ కూడా భారీ అంచనాలతోనే వచ్చింది. డిజాస్టర్ అయిన సినిమాలు టీవీ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా అదే బాటలో నడుస్తుంది అనుకున్నారు కాని షాక్ ఇచ్చే తరహాలో బ్రహ్మోత్సవం(7.52)కన్నా తక్కువ రేటింగ్ తో కేవలం 6.7 తెచ్చుకుని ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఎంత అనాసక్తిగా ఉన్నారో తేల్చి చెప్పేసింది. ఇప్పటి దాకా మహేష్ హయ్యెస్ట్ టిఆర్పి లో శ్రీమంతుడు ఇప్పటికీ 21.84తో టాప్ ప్లేస్ లో ఉంది. బ్రహ్మోత్సవం - స్పైడర్ రెండూ కూడా జీ తెలుగుకే చెందటం గమనార్హం.

ఇక శర్వానంద్ మహానుభావుడు 10 ప్లస్ రేటింగ్ వస్తుంది అనుకుంటే 8.3తో సర్దుకుంది. సాయంత్రం కాకుండా త్వరగా ప్రీమియర్ వేయటం కారణంగా కనిపిస్తోంది.సంక్రాంతి చివర్లో వేసిన నిర్మలా కాన్వెంట్ ఆశ్చర్యకరంగా 8.1 రేటింగ్ తెచ్చుకోవడం విశేషం. మొత్తానికి టీవీ ప్రీమియర్ షోల మధ్య జరిగిన యుద్ధంలో ఎన్టీఆర్ - రవితేజ జాయింట్ విన్నర్స్ గా నిలిచారు. ఆదాయంలో చాలా కీలకంగా మారుతున్న కొత్త సినిమాల ప్రసారాన్ని టీవీ ఛానల్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎంత పెట్టుబడి పెట్టడానికైనా సిద్ధపడుతున్నారు. రేటింగ్స్ వస్తే ఓకే. ఏ మాత్రం తేడా వచ్చినా పెద్ద దెబ్బే పడుతోంది.