Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్.. ఈసారి అలా చేయడు కదా!
By: Tupaki Desk | 15 Aug 2015 1:31 PM GMTసరిగ్గా ఏడాది వెనక్కి వెళ్తే అప్పుడే టెంపర్ మొదలైన హడావుడిలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదిగో అదిగో అంటూ ఆర్నెల్లు గడిపేసి ఆగస్టులో గానీ టెంపర్ మొదలుపెట్టలేదు పూరి జగన్నాథ్. మరోవైపు సినిమా అనౌన్స్ చేసినపుడే నిర్మాత బండ్ల గణేష్ జనవరి 9న రిలీజ్ అని ఘనంగా ప్రకటించుకున్నాడు. ఆరు నూరైనా.. నూరు నూట యాభై అయినా సంక్రాంతికి సినిమా రిలీజ్ ఖాయమన్నాడు. మధ్యలో అనుకోని అవాంతరాలతో సినిమా ఆలస్యమవుతూ వచ్చినా పూరి కానీ, బండ్ల కానీ వెనక్కి తగ్గలేదు. రేయింబవళ్లు పని చేస్తున్నామని.. సంక్రాంతికే సినిమా వస్తుందని ప్రకటించారు. ఎన్టీఆర్ కూడా సినిమా రిలీజ్ సంక్రాంతికే అన్నాడు. కానీ రిలీజ్ డేట్ దగ్గరపడేసరికి ప్రెజర్ బాగా ఎక్కువైపోయింది. మరీ హడావుడిగా సినిమా ముగిస్తే అసలుకే మోసం వస్తుందని భావించి సినిమాను వాయిదా వేసేశారు.
సంక్రాంతికి ‘టెంపర్’ రాకపోవడంతో అభిమానులు బాగా డిజప్పాయింటయ్యారు. నిజానికి ‘టెంపర్’ సంక్రాంతికి వచ్చి ఉంటే ఆ కళే వేరుగా ఉండేది. గోపాల గోపాల క్లాస్ సినిమా కాబట్టి.. ‘ఐ’ మూవీ ఫ్లాపైంది కాబట్టి భారీ వసూళ్లు దక్కి ఉండేవి. పరీక్షల సీజన్ లో రావడం ‘టెంపర్’కు మైనస్ అయ్యిందన్నది వాస్తవం. ఐతే ‘టెంపర్’ రిలీజ్ విషయంలో నిరాశపరిచినా.. సుకుమార్ తో చేస్తున్న ఎన్టీఆర్ కొత్త సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేసి అభిమానులకు ఆనందాన్నివ్వాలని చూస్తున్నాడు నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. నెలకిందట లండన్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ మంచి స్పీడుమీదుంది. ఐతే సుకుమార్ మామూలుగా కొంచెం స్లో.. పోస్ట్ ప్రొడక్షన్ విషయం ఓ పట్టాన తేల్చడు. కాబట్టి మళ్లీ అభిమానులు ఊరించి ఉస్సూరుమనిపించదు కదా అని డౌటొస్తోంది. ఇంకో నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కానిచ్చి.. ఇప్పుడు ప్రకటించినట్లే జనవరి 8న విడుదల చేయగలిగితే గొప్ప విషయమే. కానీ ఈసారి కూడా డిజప్పాయింట్ చేస్తే మాత్రం ఎన్టీఆర్ అభిమానులు తట్టుకోలేరు.