Begin typing your search above and press return to search.
'అరవింద సమేత' కు డెడ్ లైన్ హీట్
By: Tupaki Desk | 6 Aug 2018 6:57 AM GMTభారీ బడ్జెట్లతో భారీ తారాగణంతో తెరకెక్కించే సినిమాల రిలీజ్ విషయంలో ఎప్పుడూ డైలెమా అనేది నడుస్తుంటుంది. ఇన్ టైమ్ లో చిత్రీకరణ పూర్తి చేయకపోతే ఆ మేరకు ట్రేడ్ వర్గాలకు కంగారు తప్పదు. ప్రస్తుతం ఎన్టీఆర్ `అరవింద సమేత`కు అలాంటి సన్నివేశమే ఎదురు కానుందా? అంటే ఏమో.. ఏమైనా జరగొచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ సినిమాని డెడ్ లైన్ ప్రకారం పూర్తి చేసి రిలీజ్ చేయాల్సిన సన్నివేశం ఉంది. ఆ క్రమంలోనే దీనిపై ట్రేడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
వాస్తవానికి ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసేందుకు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ బృందం శాయాశక్తులా హార్డ్ వర్క్ చేస్తున్నారు. తారక్ ఏకంగా సెప్టెంబర్ వరకూ తన కాల్షీట్లను ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ సినిమా కోసమే కేటాయించారు. ఆ క్రమంలోనే దసరా బరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా `అరవింద సమేత`ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దసరా సెలవులు భారీ కలెక్షన్లకు పెద్ద రేంజులో కలిసొస్తాయనేది ఓ అంచనా. ఆ అంచనాకు తగ్గట్టే ట్రేడ్ లోనూ ఈ సినిమాకి భారీ డిమాండ్ నెలకొంది. కొన్ని ఏరియాల రిలీజ్ హక్కుల్ని ఇప్పటికే భారీ మొత్తాలకు కొనుక్కున్నారు డిస్ట్రిబ్యూటర్స్. అందువల్ల ఒత్తిడి పెరుగుతోందిట.
జనతా గ్యారేజ్ - జై లవకుశ తర్వాత మళ్లీ అంతే క్రేజీగా `అరవింద సమేత` 100 కోట్లు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ సాగిస్తోందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ మ్యాటర్ లో ట్రేడ్ కాస్తంత కంగారుగా ఉంటుందనడంలో ఏ సందేహం లేదు. మంచి రిలీజ్ తమకు లాభిస్తుంది. దసరా సెలవుల్లో అయితే వసూళ్ల పరంగా సేఫ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందని పంపిణీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ మేరకు మేకర్స్ పైనా తీవ్ర ఒత్తిడి నెలకొందని తెలుస్తోంది. దసరాకి `అరవింద సమేత`ను రిలీజ్ చేయాలంటే ఇంకో 40రోజులే సమయం ఉంది. సెప్టెంబర్ చివరి నాటికే తొలికాపీ రెడీ చేయాల్సి ఉంటుంది. అంటే మధ్యలో ఎలాంటి సెలవులు లేకుండా పని చేస్తేనే డెడ్ లైన్ ని చేరుకోగలరని అంచనా వేస్తున్నారు. ఇక త్రివిక్రముడి చేతిలోనే అంతా ఉందని అంటున్నారు. ఇంకో రకంగా మాయావికి ఇదో సవాల్ అన్న మాటా వినిపిస్తోంది. ఈ ఛాలెంజ్ ని త్రివిక్రమ్ ఎలా ప్రూవ్ చేస్తారో చూడాలి.