Begin typing your search above and press return to search.

#తారక్28.. అప్పుడే ఒకటైపోయింది

By:  Tupaki Desk   |   28 April 2018 5:59 AM GMT
#తారక్28.. అప్పుడే ఒకటైపోయింది
X
జై లవకుశ సినిమాతో మంచి హిట్ అందుకున్న తారక్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా అంతకంటే పెద్ద హిట్ కొట్టి తన మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. అలాగే తారక్ నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేయబోయే దర్శకుడు త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి ద్వారా వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ను తొలగించుకోవాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం సినిమా కోసం ఇద్దరు చాలా కష్టపడుతున్నారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. కొన్ని రోజుల క్రితం స్టార్ట్ చేసిన సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. అప్పుడే ఒక షెడ్యూల్ పూర్తయిపోయిందా అనే రీతిలో.. త్రివిక్రమ్ తెగ స్పీడుతో దూసుకుపోతున్నాడు. మేజర్ ఎపిసోడ్స్ ని చిత్ర యూనిట్ చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేసింది. ఇక తరువాత షెడ్యూల్ ని చిత్ర యూనిట్ మే మొదటి వారంలోనే స్టార్ట్ చేయాలని అనుకుంటోంది. అందుకు సంబందించిన సన్నాహకాలు కూడా జరుగుతున్నాయి. సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి అక్టోబర్ లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం తారక్ తన ఫిట్ నెస్ లో మార్పులు చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ కూడా తన గత టాలెంట్ ను ఈ సినిమా ద్వారా చూపించాలని అనుకుంటున్నాడు. సినిమాపై అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సరికొత్త కాంబినేషన్ అనగానే అభిమానులలో కొత్త తరహా క్రేజ్ పెరిగింది. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.