Begin typing your search above and press return to search.
సంక్రాంతి హీరోలు ఎన్టీఆర్, విశాల్
By: Tupaki Desk | 17 Jan 2016 11:30 AM GMTఈ ఏడాది సంక్రాంతి హీరో ఎవరు? ఈ ప్రశ్నకు ఆన్సర్ అంత తేలికేం కాదు కానీ.. అంచనా వేయడం అంత కష్టం కూడా కాదు. ఒకసారి రెండు సినిమాలు రిలీజ్ అయితేనే, పోటీ తట్టుకోవడం కష్టం అనుకుంటున్న రోజుల్లో.. నాలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి. అన్నిటికీ మంచి టాక్ వచ్చి, వసూళ్లు రాబడుతున్నా.. ఇందులో మూడు మాత్రమే భారీ సినిమాలు. డిక్టేటర్, నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలు భారీ వసూళ్లతో దూసుకుపోతున్నాయి.
అయితే.. ఈ మూడింటిలోను ఒక రోజు ముందే వచ్చిన అడ్వాంటేజ్ తోపాటు ఎక్కువ క్రేజ్ ఉన్న మూవీ నాన్నకు ప్రేమతో. అంచనాలకు తగ్గట్టుగానే తొలి వారాంతం చివరకే 35 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టిస్తోంది ఎన్టీఆర్ మూవీ. మిగిలిన మూవీస్ కూడా హిట్ అయినా, ఇంతగా వసూళ్లు రాలేదనే మాట వాస్తవమే. అందుకే ఈ ఏడాది సంక్రాంతి అందరికీ హిట్ ఇచ్చినా, బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ ని ఈ సారి సంక్రాంతి స్టార్ గా చెప్పాల్సిందే.
ఇక తమిళంలో సంక్రాంతి స్టార్ గా విశాల్ నిలిచాడు. ఈ పొంగల్ కోలీవుడ్ కి కూడా చాలా ఇంపార్టెంట్. శివ కార్తికేయన్ మూవీ రజినీ మురుగన్, ఉదయనిధి స్టాలిన్ గెత్తు, బాల డైరెక్షన్ లో తారై తాపట్టైలతో పాటు.. విశాల్ కథకళి కూడా రిలీజ్ అయింది. అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ ఉన్నా.. కథకళికే హైయెస్ట్ కలెక్షన్స్ వస్తుండడం విశేషం. గతేడాది ఆంబళతో సంక్రాతి హీరో అనిపించుకున్న విశాల్, ఈ ఏడాది దాన్ని కంటిన్యూ చేశాడు.