Begin typing your search above and press return to search.

తార‌క్‌ ఈ కొత్త క‌థ‌లేంటో?

By:  Tupaki Desk   |   15 Sep 2018 6:54 AM GMT
తార‌క్‌ ఈ కొత్త క‌థ‌లేంటో?
X
అన‌గ‌న‌గ అంటూ ఒక క‌థ చెబుతాను వింటారా? అంటూ ప‌ల‌క‌రిస్తాడ‌ట ఎన్టీఆర్‌. సాయంత్రం 4గం.5 నిమిషాల‌కు ముహూర్తం పెట్టేశామ‌ని ఊరిస్తున్నాడు. ఇంత‌కీ ఏమా క‌థాక‌మామీషు అంటే... వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబో ప్ర‌స్తుతం అర‌వింద స‌మేత చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్‌ లుక్ ఇదివ‌ర‌కూ రిలీజ్ చేశారు. తార‌క్ లుక్‌ కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ఇక‌పోతే టీజ‌ర్ మాస్‌ కి పూర్తిగా క‌నెక్ట‌వ్వ‌డంతో యూట్యూబ్‌ లో దూసుకుపోతోంది. అయితే ప్ర‌మోష‌న్స్‌ లో ఈ స్పీడ్ స‌రిపోద‌ని భావించిన హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అధినేత రాధాకృష్ణ మ‌రింత వేగం పెంచేందుకు ప్లాన్ చేశార‌ట‌.

నేటి (శనివారం) అర‌వింద సమేత నుంచి తొలి సింగిల్‌ ను రిలీజ్‌ చేయనున్నామ‌ని ప్రకటించారు. `అనగనగనగా...` అంటూ సాగే పాటను ఈ రోజు సాయంత్ర 4 గం. 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నామ‌ని తెలిపారు. తమన్‌ సంగీతం అందించ‌గా - ఈ పాట‌ను అర్మన్‌ మాలిక్ ఆలపించారు. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. జగపతి బాబు - నాగబాబు - ఈషా రెబ్బా - సునీల్‌ - రావూ రమేష్ త‌దిత‌రులు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.