Begin typing your search above and press return to search.
పెనిమిటి ఇన్ని అంచనాలు ఏమిటి
By: Tupaki Desk | 19 Sep 2018 7:42 AM GMTజూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న అరవింద సమేత వీర రాఘవ మీద ఇప్పటికే ఉన్న అంచనాలు ఆడియో వల్ల ఇంకా పైకి ఎగబాకుతున్నాయి. ఆ మధ్య కొద్దిరోజుల పాటు సైలెంట్ ఉన్న టీమ్ ప్రమోషన్ విషయంలో వేగం పెంచింది. అక్టోబర్ 11 విడుదల ఖరారైనప్పటికీ ప్రీ రిలీజ్ లోనే ప్రకటించాలని గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. ఇటీవలే విడుదల చేసిన మొదటి ట్రాక్ అభిమానుల నుంచే కాక సంగీత ప్రియుల నుంచి మంచి స్పందనే దక్కించుకుంది. మరీ తమన్ కెరీర్ బెస్ట్ ట్రాక్ అంటే అతిశయోక్తి అవుతుందేమో కానీ ఓవరాల్ గా మెప్పించిందనే చెప్పాలి. ఇక ఇవాళ సాయంత్రం విడుదల చేయబోతున్న పెనిమిటి పాట గురించి ఒక్కొక్కరు ఒక్కోరకంగా పొగడ్తలతో ముంచెత్తడంతో ఫ్యాన్స్ లో ఉత్సుకత పెరుగుతూ పోతోంది. దర్శకుడు సుధీర్ వర్మ రెండు రోజుల క్రితమే దీని గురించి ఓ రేంజ్ లో ట్వీట్ చేయటం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసేలా చేసింది. దశాబ్దాల పాటు నిలబడిపోయే పాట అవుతుందని చెప్పడం విశేషం.
ఇక ఈ పాట గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అయితే త్రివిక్రమ్ కు రుణపడి ఉంటానని అంత గొప్ప సందర్భాన్ని తనకు ఇచ్చారని ఇది మాములు పాటగా ఉండబోదని గట్టి హామీ ఇచ్చేసారు. గతంలో భరత్ అనే నేను విషయంలో దండాలయ్యా సామీ పాట టైంలో కూడా ఈయన ఇలాగే హింట్ ఇచ్చారు. ఆయన చెప్పినట్టే అది ఆల్బమ్ లోనే బెస్ట్ సాంగ్ గా నిలిచింది. ఇప్పుడు పెనిమిటి కూడా అలాగే చెబుతుండటంతో అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక దీనికి స్వరం అందించిన కీరవాణి తనయుడు కాలభైరవ కూడా ప్రత్యేకంగా ట్వీట్ చేయటంతో ఇది ఎలా ఉండబోతోంది అన్నది ఊహకు అందటం లేదు. మొత్తానికి పెనిమిటి మీద అల్లుకున్న హైప్ చూస్తుంటే వ్యూస్ తో హోరెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.