Begin typing your search above and press return to search.
లీకులతో అరవిందుని బెంబేలు!
By: Tupaki Desk | 23 July 2018 7:19 AM GMTలీకుమీద లీకులిచ్చే వీరులున్నారు. భారీ క్రేజుతో తెరకెక్కే అగ్రహీరోల సినిమాలకు సంబంధించిన కీలక సమాచారం లీక్ చేసేందుకు ఎలాంటి బెరుకు లేకుండా అత్యుత్సాహం చూపించేవాళ్లున్నారు. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలకు సంబంధించిన దాచాల్సిన విషయాల్ని బయటకు లీక్ చేశారు. ఆయా సందర్భాల్లో దర్శకహీరోలు - నిర్మాతలు లబోదిబోమన్న సందర్భాలున్నాయి.
తాజాగా ఎన్టీఆర్ బృందం అలాంటి డిఫెన్స్‌లోనే పడడం వాడి వేడిగా చర్చకొచ్చింది. ఎన్టీఆర్- త్రివిక్రమ్ కలయికలో `అరవింద సమేత` ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ సహా చాలా విషయాలపై ఇప్పటికే లీకులొచ్చాయి. మరోసారి ఈ సినిమాలో కీలక సన్నివేశాన్ని రివీల్ చేసే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది తండ్రి కొడుకుల సెంటిమెంటుతో తెరకెక్కుతోంది. డాడ్ కోసం ఎంతకైనా తెగించే కొడుకుగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇంచుమించు `నాన్నకు ప్రేమతో` సెంటిమెంటు ఇందులోనూ ఉందని ఇదివరకూ సమాచారం లీకైంది. అందుకు సింబాలిక్‌గా ఉన్న ఫోటో ఒకటి తాజాగా లీకైంది. తండ్రి నాగబాబు గాయపడి హారిబుల్ సన్నివేశంలో ఉంటే కార్ డ్రైవ్ చేస్తూ హర్రీగా ఉన్న ఎన్టీఆర్ ఫోటో చూస్తుంటే - ఇదేదో ఫ్యాక్షన్ ఎటాక్ నుంచి ఎస్కేప్ అయ్యి తండ్రిని రక్షించుకునే ప్రయత్నమే అనిపిస్తోంది. మొత్తానికి ఈ ఒక్క ఫోటో టోటల్ సినిమా థీమ్ ని రివీల్ చేసేయడం చర్చకొచ్చింది. దసరా కానుకగా అరవింద సమేత చిత్రాన్ని అక్టోబఱ్ 12న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. జగపతిబాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.