Begin typing your search above and press return to search.

లీకులతో తలపట్టుకుంటున్న అరవింద టీమ్!

By:  Tupaki Desk   |   10 Aug 2018 10:34 PM GMT
లీకులతో తలపట్టుకుంటున్న అరవింద టీమ్!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇద్దరూ ఇండస్ట్రీలో చాలా ఏళ్ళ నుండి ఉంటున్నా మొదటి సారి కలిసి పని చేస్తుండడంతో ఆ సినిమా ఎలా ఉండబోతుందో అని రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే 'అరవింద సమేత' సినిమా లొకేషన్స్ నుండి ఫోటో లీకుల ప్రవాహం ఆగడం లేదు. ఇదివరకె రెండు ఫోటోలు లీక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరి కొన్ని లీకయిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. ఫోటోల మీద ఉండే డేట్స్ మిగతా కోడ్స్ నిబట్టే చూస్తే ఇది రా ఫుటేజ్ అని అంటున్నారు కొందరు. మరి కొందరు ఇది ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అయి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. ఏదైమైనా ఈ ఫోటో లీకులు అరవింద టీమ్ కు పెద్ద సమస్యగా తయారయింది. దీంతో ఎవరు ఈ లీకులు చేస్తున్నారనే విషయంపై టీమ్ సీరియస్ గా దృష్టి సారించిందట.

మరోవైపు ఈ సినిమా టీజర్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా అక్టోబర్ 15 న రిలీజ్ చేయనున్నారు. 'అరవింద సమేత' అక్టోబర్ 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ కు జోడీగా పూజా హెగ్డే - ఈషా రెబ్బా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు - నాగబాబు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.