Begin typing your search above and press return to search.
అరవింద సమేత`కు గుమ్మడికాయ
By: Tupaki Desk | 1 Aug 2018 8:10 AM GMTఎన్టీఆర్ - త్రివిక్రమ్ హైస్పీడ్‌లో వెళుతున్నారు. వీళ్లకు బ్రేకులేసేవాళ్లే లేరు. అడ్డూ ఆపూ లేకుండా హైవేలో వెళుతున్నారు. ఇక త్రివిక్రముని స్పీడేంటో కానీ ఈసారి ఎట్టి పరిస్థితిలో ట్రాక్ లోకి వచ్చేందుకు కసిగా ట్రై చేస్తున్నాడట. ప్రస్తుతం `అరవిందసమేత` హైదరాబాద్ పరిసరాల్లో తెరకెక్కుతోంది. ఆన్ లొకేషన్ స్పాట్ బాయ్ అందించిన సమాచారం ప్రకారం..
ఇక ఇప్పటికే చిత్రీకరణ మెజారిటీ పార్ట్ పూర్తయిపోయింది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఎన్టీఆర్ లో చూడని ఓ కొత్త కోణాన్ని త్రివిక్రముడు తెరపై ఆవిష్కరిస్తున్నారట. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మునుపెన్నడూ చూడనంత గగుర్పొడిచే యాక్షన్ తో ఇరగదీస్తుందని తెలుస్తోంది. ఎమోషన్స్ పరంగా పీక్స్ ని చూస్తారని చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టే సమయం ఆసన్నమైందన్న వార్త అందింది. మహా అయితే ఇంకో 45రోజులే. సెప్టెంబర్ 15న గుమ్మడికాయ కొట్టేస్తున్నారు. అటుపై అన్నిపనులు పూర్తి చేసి - అక్టోబర్ 10న దసరా కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు. విదేశాల్లో ఓ పాటను చిత్రీకరణ కోసం యూనిట్ విదేశాలకు వెళుతోందిట.