Begin typing your search above and press return to search.

'అరవింద సమేత' టీజర్ ఎలా ఉంటుందంటే.?

By:  Tupaki Desk   |   14 Aug 2018 4:38 AM GMT
అరవింద సమేత టీజర్ ఎలా ఉంటుందంటే.?
X
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు ఒక్కసారిగా పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి.. రచయితగా ఫుల్ పాపులర్ అయ్యి అనంతరం దర్శకుడిగా మారి టాలీవుడ్ నంబర్1 డైరెక్టర్ గా ఎదిగారు. ‘అజ్ఞాతవాసి’ ఫలితంతో తేరుకోలేకపోయాడు. అందుకే ఇప్పుడు తన సహజ శైలికి భిన్నంగా ‘అరవింద సమేత’ను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

త్రివిక్రమ్ మొదటి నుంచి సందర్భానుసారం కామెడీ - కుటుంబ - ప్రేమ కథా నేపథ్యమున్న సినిమాలనే తెరకెక్కించారు. కానీ తొలిసారి ఆయన పంథా మార్చారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కొంచెం ఫ్యాక్షన్ తరహా కథను రూపొందించారనే టాక్ వినిపిస్తోంది. నిన్ననే విడుదలైన పోస్టర్ చూస్తే త్రివిక్రమ్ ఈ సినిమాతో కొత్తదారిలోకి వెళ్లాడని మనకు అర్థమవుతోంది. తాజాగా రేపు టీజర్ విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో త్రివిక్రమ్ లోని ఆ కొత్త దారి ఏంటి.? ఎలా ఎన్టీఆర్ ను చూపించాడనేది ఆసక్తిగా మారింది.

ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘అరవింద సమేత’ మూవీ టీజర్ ఆగస్టు 15న విడుదల అవుతోంది. ఇప్పటికే దాదాపు పూర్తి అయిన ఈ టీజర్ ప్రస్తుతం సంగీత దర్శకుడు థమన్ చేతిలో ఉందట.. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫినిషింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

అరవింద సమేత మూవీ నుంచి వస్తున్న తొలి టీజర్ కావడంతో దాదాపు 55 నుంచి 58 సెకన్ల మధ్య కట్ చేసినట్టు వార్తలు బయటకు వచ్చాయి. సినిమా కథకు సంబంధించిన కీలకమైన మూడు పాయింట్లను ఇందులో చూపించబోతున్నారట.. గతం - వర్తమానం - భవిష్యత్తు అనే మూడు యాంగిల్స్ ను ఈ టీజర్ లో ఉండబోతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ కు రెండు భారీ డైలాగులు - విలన్ జగపతిబాబుకు ఓ డైలాగ్.. హీరోయిన్ కు సంబంధించిన కొన్ని సీన్లు ఉన్నాయని అంటున్నారు. దీంతో ఈ టీజర్ ఎలా ఉంటుంది.. త్రివిక్రమ్ తొలిసారి కామెడీ ట్రాక్ వదిలి రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడంతో సినిమా ఎలా ఉండబోతోందా అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఈ సంవత్సరం సెకండాఫ్ లో వస్తున్న ఈ భారీ మూవీ ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి..