Begin typing your search above and press return to search.
అరవింద రాఘవ ఆన్ ది వే
By: Tupaki Desk | 27 Aug 2018 7:16 AM GMTదసరాకు బాక్స్ ఆఫీస్ మీద దాడి చేయడానికి రెడీ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ కోసం అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటిసారి వస్తున్న కాంబో కాబట్టి అంచనాలు కూడా మాములుగా లేవు. వారం క్రితం విడుదలైన టీజర్ ఫుల్ మాస్ మసాలాతో ఉండటంతో ఫ్రెష్ గా కామెడీ ఎలిమెంట్స్ తో మరో టీజర్ రిలీజ్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అబ్బే అదంతా ఉత్తుత్తి వార్త అలాంటిది ఏమి లేదని యూనిట్ తరఫున ఖండన వచ్చేసింది కూడా. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేదే అసలు ప్రశ్న. అధికారికంగా ప్రకటించక పోయినా విడుదల తేదీ అక్టోబర్ 11లో మార్పు లేనట్టే. వాయిదా వేసుకునే సౌలభ్యం అంత ఈజీగా ఉండకపోవచ్చు. సో దీనికే కట్టుబడి ఆ మేరకు షూటింగ్ ని వేగవంతం చేస్తూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ ని సైతం ఫాస్ట్ గా నడిపిస్తున్నాడట త్రివిక్రమ్. సరిగ్గా లెక్కవేస్తే చేతిలో కేవలం 40 రోజులు మాత్రమే టైం ఉంది. ఇందులో ఎంత లేదన్నా 10 రోజులకు పైగా ప్రమోషన్ తదితర కార్యక్రమాల కోసం పక్కన పెట్టాల్సి ఉంటుంది.
ఈ నేపధ్యంలో వినాయక చవితి పండగ సందర్భంగా ఒక స్పెషల్ మోషన్ పోస్టర్ తో పాటు చిన్న బిట్ సాంగ్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉందట టీమ్. బయటికి చెప్పకపోయినా దాదాపు ఖరారు అయినట్టు సమాచారం. అది పబ్లిక్ తో పాటు సోషల్ మీడియాలోకి వెళ్ళాక కొంచెం గ్యాప్ ఇచ్చి మూడో వారం లేదా నాలుగో వారంలో ట్రైలర్ రిలీజ్ చేస్తే టాక్ ని స్టడీగా మైంటైన్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఆ మేరకు ప్లానింగ్ జరుగుతుందని తెలిసింది. మొదటి టీజర్ ని కావాలనే మసాలా అంశాలతో నింపారని ట్రైలర్ చూస్తే త్రివిక్రమ్ మార్క్ ఎక్కడా మిస్ కాలేదనే క్లారిటీ వస్తుందని యూనిట్ సభ్యుల మాట. తారక్ ఫాన్స్ మాత్రం జై లవకుశ వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా ఎప్పుడెప్పుడు వీర రాఘవుడిని తెరమీద చూస్తామా అనే ఉత్సుకతతో ఉన్నారు. సెప్టెంబర్ 13న పండగ రోజు కొత్త సినిమాల విడుదల హడావిడితో పాటు అరవింద సమేత వీర రాఘవ హల్చల్ కూడా ఉంటుందన్న మాట. చూద్దాం.