Begin typing your search above and press return to search.

బ్యాంక్ మేనేజర్ గా యంగ్ టైగర్

By:  Tupaki Desk   |   5 April 2017 3:39 AM GMT
బ్యాంక్ మేనేజర్ గా యంగ్ టైగర్
X
జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా మూడు పాత్రల్లో నటిస్తున్న మూవీ జై లవ కుశ. ఇవాళ ఈ చిత్రానికి లోగో లుక్ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నాడని తెలిసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరోవైపు ఈ కేరక్టర్ల కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హర్త్ వెల్ ను తీసుకురావడంతో.. కేరక్టర్స్ లో ఏ రేంజ్ వేరియేషన్ చూపించనున్నారనే విషయం అర్ధమైపోయింది.

ఒక్కో కేరక్టర్ కి సంబంధించిన షూటింగ్ ను కంప్లీట్ చేసేలా షూట్ ప్లాన్ చేసిన దర్శకుడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో కనిపించే పాత్రను పూర్తి చేస్తున్నాడు. ఈ పాత్ర పేరు ఎన్. లవ కుమార్ అనే విషయాన్ని అఫీషియల్ గానే చెప్పారు యూనిట్. హరికృష్ణ షూటింగ్ స్పాట్ కు వచ్చినపుడు తీసిన ఫోటో ద్వారా ఈ విషయం చెప్పగా.. ఈ పాత్రకు సంబంధించిన కొత్త అప్ డేట్ వచ్చింది. మూడు రోల్స్ లోను ఇది కీలకం అని.. బ్యాంక్ మేనేజర్ గా కనిపించే పాత్ర అనే టాక్ వినిపిస్తోంది. మిగిలిన రెండు పాత్రలను లింక్ చేసేది రోల్ కావడంతోనే.. ముందుగా ఈ బ్యాంక్ మేనేజర్ ఎపిసోడ్ పిక్చరైజ్ చేస్తున్నారట.

ముందుగా ఈ పాత్రను పూర్తి చేశాక.. రెండో రోల్ కు హర్ట్ వేల్ మేకప్ సహాయంతో మరో విభిన్నమైన కేరక్టర్ ను.. చివరగా అత్యంత కీలకమైన నెగిటివ్ పాత్రను షూటింగ్ చేయనున్నారని అంటున్నారు. రాశిఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో ఇద్దరు హీరోయిన్లను త్వరలో అనౌన్స్ చేయనుంది జై లవ కుశ టీం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/