Begin typing your search above and press return to search.
ఏంటీ! ఎన్టీఆర్ అంత అమాయకుడా!
By: Tupaki Desk | 24 Aug 2017 11:48 AM GMTజూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవ కుశ అప్ డేట్స్ కోసం నందమూరి అభిమానులు తెగ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మరో నాలుగు వారాల్లో సినిమా రిలీజ్ ఉండగా.. ఇంకా కేరక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేయకపోవడంతో కాసింత అసంతృప్తిగా ఉన్నా.. ఎన్టీఆర్ ఏదో ఒక మ్యాజిక్ చేసేస్తాడని మాంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
కానీ జై లవ కుశ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తుండగా.. వీటిలో ఒకటైన లవకుమార్ పాత్రను పరిచయం చేస్తూ టీజర్ విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా ముందు రోజే యూట్యూబ్ లో విడుదలైన ఈ టీజర్.. ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. బ్యాంక్ మేనేజర్ గా తనను తాను పరిచయం చేసుకున్నాక.. ఎన్టీఆర్-బ్రహ్మాజీలు కలిసి కనిపించిన సీన్ లో ఆర్టిఫిషియాలిటీ మరీ ఎక్కువగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. లవ కుమార్ పాత్రను అమాయకుడిగా చూపించాలని భావించిన దర్శకుడు.. ఇలాంటి కేరక్టర్ జనాలకు ఏ మాత్రం ఎక్కదనే విషయాన్ని పెద్దగా పట్టించుకున్నట్లుగా లేదు. పైగా ఈ పాత్రను చూస్తే... జనతా గ్యారేజ్ మూవీలో రాజీవ్ కనకాల పోషించిన ప్రభుత్వోద్యోగి పాత్రను కాసింత డెవలప్ చేసినట్లుగా అనిపిస్తుందంతే.
జై పాత్ర కోసం తన నటనలోనూ పూర్తి వైవిధ్యత ప్రదర్శించిన ఎన్టీఆర్.. లవ కుమార్ పాత్ర కోసం ఏమీ ప్రయత్నించలేదనే సంగతి తెలిసిపోతూనే ఉంది. ఏతా వాతా ఈ టీజర్ మొత్తంలో ఆకట్టుకునే ఒకే ఒక్క పాయింట్.. ఎన్టీఆర్ తో చెప్పించిన డైలాగ్ మాత్రమే. "మంచితనం.. ఇది పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది.. జీవితంలో ఉంటే గుణపాఠం అవుతుంది" అంటూ ఎన్టీఆర్ తన స్టైల్ లో చెప్పిన వన్ లైనర్ ఒక్కటే ఈ టీజర్ లో అభిమానులకు ఊరట కలిగించే విషయం.