Begin typing your search above and press return to search.

పెద్ద ఫ్యామిలీలు కొట్టుకుంటే అంతే సంగ‌తి

By:  Tupaki Desk   |   25 Dec 2015 11:30 AM GMT
పెద్ద ఫ్యామిలీలు కొట్టుకుంటే అంతే సంగ‌తి
X
స్టార్ హీరోల సినిమాలు రిలీజ‌వ్వాలంటే మినిమం రెండు వారాల గ్యాప్ త‌ప్ప‌నిస‌రి అని ఓ రూల్ పెట్టుకున్నారు. ఇటీవ‌లి కాలంలో ఈ రూల్‌ ని ప్ర‌తి ఒక్క‌రూ ఆచ‌రించారు. దానివ‌ల్ల భారీ సినిమాల‌కు న‌ష్టాలు రాకుండా ఆప‌డం సాధ్య‌మైంది. అయితే ఈసారి 2016 సంక్రాంతి సీజ‌న్‌ లో మాత్రం ఆ ప‌ప్పులేవీ ఉడికేట్టు క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే టాలీవుడ్‌ కి చెందిన మూడు అగ్ర కుటుంబాలు పోటీప‌డుతున్నాయి. ముగ్గురు అగ్ర హీరోలు నువ్వా? నేనా? అంటూ థియేట‌ర్ల‌లో కొట్టుకునే ప‌రిస్థితి. బాల‌య్య‌బాబు - ఎన్టీఆర్‌ - నాగార్జున ముగ్గురూ స్టార్ హీరోలే. ఈ ముగ్గురూ ఈసారి సంక్రాంతి బ‌రిలో పందెంకోళ్లుగా కొట్టుకోబోతున్నారు. ఇప్ప‌టికే మంచి థియేట‌ర్ల విష‌యంలో పోటీ న‌డుస్తోంది. ఒక‌రిపై ఒక‌రు పోటీకి దిగాల్సిన స‌న్నివేశం ఏర్ప‌డింది. అయితే ఈ ఠ‌ఫ్ కాంపిటీష‌న్ వ‌ల్ల ఏ సినిమా హిట్ట‌యితే ఆ సినిమా కొనుక్కున్న వాళ్లే సేఫ్ అవుతార‌న్న‌ది ట్రేడ్ పండితుల విశ్లేషిస్తున్నారు. అలాగే భారీ బ‌డ్జెట్‌ లు స‌క్సెస్‌ - ఫెయిల్‌ ని డిసైడ్ చేయ‌బోతున్నాయ్‌. బ‌డ్జెట్‌ కి త‌గ్గ‌ట్టే ఎక్కువ వారాలు ఈ సినిమాలు థియేట‌ర్ల‌లో ఆడ‌క‌పోతే అంతే సంగ‌తి అంటూ ఎనాలిసిస్ చెబుతున్నారు.

ఎన్టీఆర్ హీరోగా న‌టించిన నాన్న‌కు ప్రేమ‌తో చిత్రం 55 నుంచి 60 కోట్ల వ‌ర‌కూ థియేట్రిక‌ల్ రిలీజ్ రూపంలో బిజినెస్ చేస్తోంది. ఇక డిక్టేట‌ర్ 35 నుంచి 40 కోట్ల మేర వ్యాపారం పూర్తి చేసుకుంటోంది. అలాగే సోగ్గాడే చిన్నినాయ‌నా 25 కోట్ల రేంజులో ఉంది. అంటే ఈ మూడింటిలో ఏ సినిమాకి హిట్టు టాక్ వ‌స్తుంది అన్న దానిని బ‌ట్టే సేఫ్ బెట్టింగ్ న‌డుస్తుంది. ఈ మూడు సినిమాలు జ‌న‌వ‌రి 13 - జ‌న‌వ‌రి 14 - జ‌న‌వ‌రి 15 రిలీజ్‌ ల‌కు రెడీ అవుతున్నాయి. అంటే ఒక్క‌రోజు తేడాతో ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్లు రాబ‌ట్టుకున్నా, ఆ త‌ర్వాత లాంగ్ ర‌న్‌ లో బోలెడంత రాబ‌ట్టాల్సి ఉంటుంది. అలా రావాలంటే హిట్టు సినిమా ఇది అన్న టాక్ రావాలి. పైగా వీటితో పాటు సునీల్ కృష్ణాష్ఠ‌మి - శ‌ర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా కూడా పోటీ కి దిగుతున్నాయ్‌. కాబ‌ట్టి మూడు పెద్ద సినిమాల మ‌ధ్య పోటీ సీరియ‌స్ మ్యాట‌ర్ కిందే లెక్క‌. ఈ పోరులో డిస్ర్టిబ్యూట‌ర్లు చేతులెత్తేయకూడ‌దు మ‌రి!