Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ నంబర్ వన్.. చిరు నెంబర్ టెన్
By: Tupaki Desk | 2 Feb 2017 12:54 PM GMTఇలా చెబ్తే మెగా ఫ్యాన్స్ కు కోపం రావచ్చేమో కానీ.. ఓ ఆన్ లైన్ పోల్ లో ఇలాగే ఓట్లు పడ్డాయి. ఓ విషయంలో పోల్ నిర్వహిస్తే.. ఎన్టీఆర్ కు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన నెటిజన్లు.. చిరంజీవికి పదో ర్యాంక్ మాత్రమే కట్టబెట్టారు. ఇంతకీ ఇది ఏ విషయంలో ర్యాంకింగ్ అనుకుంటున్నారా? అదే అసలైన షాకింగ్ న్యూస్.
చిరంజీవిని ఏ విషయంలో అయితే ఫ్యాన్స్ ఎక్కువగా అభిమానిస్తారో.. ఆ డ్యాన్సుల విషయంలోనే మెగాస్టార్ ని 10వ ర్యాంక్ కి పరిమితం చేయడం ఆశ్చర్యకరం. పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి తన రేంజ్ ప్రూవ్ చేసుకున్నా.. బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని ఓ సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో.. చిరుకు పదో ర్యాంక్ మాత్రమే దక్కింది. ఈ లిస్ట్ లో 22 శాతం ఓట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఎన్టీఆర్ నిలవగా.. 13 శాతం ఓట్లతో సెకండ్ ర్యాంక్ ను బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సొంతం చేసుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు 11 శాతం ఓట్లతో మూడో ర్యాంక్ దక్కడం విశేషం. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాను 4వ ర్యాంక్ లోను.. లారెన్స్ 5వ ర్యాంక్ లోను నిలిచారు.
మాధురి దీక్షిత్ ఆరో స్థానంలో నిలవగా.. ఐశ్వర్యారాయ్ 9వ ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఈ లిస్ట్ లో రామ్ చరణ్ ఏకంగా 17వ స్థానానికి పరిమితం కావడంతో.. ఈ సర్వే అంతా బూటకం అనేస్తున్నారు మెగాభిమానులు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం భలే సంబరంగా ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/