Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ 16న వచ్చేస్తున్నాడు
By: Tupaki Desk | 4 July 2017 8:31 AM GMTతెలుగు టీవీ చరిత్రను మార్చేసే షో సిద్ధమైపోతోంది. ఇంతవరకు తెలుగు ప్రేక్షకులు చూడని రియాలిటీ షో బిగ్ బాస్ ఈనెల 16 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ మా టీవీలో టెలీకాస్ట్ అయ్యే ఈ ప్రోగ్రాంను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు. రొటీన్ ప్రోగ్రాంల్లా ఇందులో స్టార్ట్ కెమెరా... కట్ లాంటివేం ఉండవు. 12 మంది సెలబ్రిటీలు 70 రోజులపాటు ప్రపంచానికి దూరంగా కలిసి ఎలా ఉంటారన్నదే బిగ్ బాస్ కాన్సెప్ట్. 60 కెమెరాలు వీరి కదలికలను నిరంతరం చిత్రీకరిస్తూనే ఉంటాయి.
బిగ్ బాస్ షో అనౌన్స్ మెంట్ నుంచే ఎన్నెన్నో ప్రత్యేకతలకు వేదికగా నిలిచింది. మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ఓ టీవీ షోకు హోస్ట్ చేయబోతున్నాడు. ఈ షో కోసం 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత భారీ సెట్ వేశారు. తెలుగు టీవీ షోల కోసం మునుపెన్నడూ ఇంతటి సెట్ వేయలేదు. ఇందుకోసం భారీగానే ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్టు కోసం 750 మంది టైంతో సంబంధం లేకుండా పని చేస్తున్నారు. బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తోంది. ఏడు రోజులుగా స్టార్ మా నెట్ వర్క్ లో టెలికాస్ట్ అవుతున్న ప్రోమోలకు ఇప్పటివరకు 55 మిలియన్ల మందికి రీచ్ అయిందని అంచనా. ఈ షో కోసం స్టార్ మా నెట్ వర్క్ చాలానే గ్రౌండ్ వర్క్ చేసింది. షో పాల్గొనాల్సిందిగా 100 మందిని సంప్రదించారు. వీరిలో చాలామంది పాజిటివ్ గానే రియాక్ట్ అవడంతో అందులో డజన్ మందిని ఎంపిక చేశారు. వీరంతా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నారు.
బిగ్ బాస్ షో తెలుగు టీవీలకు గేమ్ ఛేంజర్ అవుతుందని హోస్ ఎన్టీఆర్ గతంలోనే చెప్పాడు. అందుకు తగ్గట్టుగా వ్యూయర్స్ కు గుర్తుండిపోయేలా మంచి ఎంటర్ టెయిన్ మెంట్ ఈ షో ద్వారా అందిస్తామని స్టార్ మా నెట్ వర్క్ ప్రామిస్ చేస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/