Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ భలే లక్కీ బాసూ!!

By:  Tupaki Desk   |   4 Aug 2017 5:30 PM GMT
ఎన్టీఆర్ భలే లక్కీ బాసూ!!
X
ఓ నాలుగు వారాల క్రిందట స్టార్ మా వారి టిఆర్పీలు 500+ స్థాయిలో ఉన్నయి. ఇప్పుడు బిగ్ బాస్ మొదలయ్యాక నాలుగు వారాల తరువాత చూస్తే.. ఏకంగా 800+ టిఆర్పీలు వచ్చేసి.. ఆ ఛానల్ ను నెం.1 చేసేశాయి. అయితే ఇదంతా కూడా కేవలం జూనియర్ ఎన్టీఆర్ 'బిగ్ బాస్' హోస్టింగ్ చేయడం వలనేనా? రోజంతా టివిల్లో ఒక గంటపాటు కనిపించినా అక్కినేని నాగార్జున.. మెగాస్టార్ చిరంజీవి.. తదితరులు చేయలేకపోయిన ఫీట్ ను ఎన్టీఆర్ ఎలా చేశాడు?

నిజానికి ఆ సీనియర్ స్టార్లు రోజూ కనిపిస్తే ఇక్కడ ఎన్టీఆర్ మాత్రం కేవలం రెండు రోజులు మాత్రమే కనిపిస్తాడు. వారాంతం వచ్చే రెండు ఎపిసోడ్లను మాత్రమే హోస్ట్ చేస్తాడు. అయినాసరే ఈ కార్యక్రమానికి ఇంతేసి రేటింగ్ వచ్చేయడానికి కారణం ఏమైయుంటుంది? దినీ గురించి టివి ఎనలస్టిలు మాట్లాడుతూ.. ఇక్కడ ఎన్టీఆర్ హోస్టింగ్ టాలెంట్ రెండు రోజులకే పనిచేస్తే.. తక్కిన ఎపిసోడ్లలో కంటెస్టంట్లే బలం అంటున్నారు. ముందులో ఈ కాన్సెప్ట్ అర్ధంకాలేదు కాని.. తరువాత తరువాత ఇందులోని వివాదాలూ.. జ్యోతి ఎక్సిట్.. సంపూ సూసైడ్ డ్రామా.. మధుప్రియ ఎక్సిట్.. దీక్షా పంక్త్ అందాలు.. కిస్సులు.. అబ్బో నానా రచ్చ చేసేశాయి. ఆటోమ్యాటిక్ గా ఈ కార్యక్రమంపై ఆసక్తిని పెంచేశాయి.

ఇవన్నీ కలుపుకుని.. గతంలో స్టార్లు హోస్ట్ చేసిన ప్రోగ్రామ్స్ ను కేవలం 1 గంటపాటే వేసిన ఈ ఛానల్.. ఇప్పుడు బిగ్ బాస్ ను మాత్రం ఏకంగా 9 గంటల నుండి 11 గంటల వరకు ప్రసారం చేస్తోంది. దాని కారణంగా ఈ కార్యక్రమానికి వీక్షకులు ఎక్కువైపోయారు. ఆ సమయంలో తెలుగు ఛానల్స్ ను అటూ ఇటూ మారుస్తున్నప్పుడు.. అస్తమానం ఇదే ప్రోగ్రామ్ కనిపిస్తోంది ఏంటి అంటూ ఒక లుక్కేసే వీలుంది. ఆ విధంగా మా టివి అది ప్లస్సయితే.. దాని కారణంగా వస్తున్న టిఆర్పీలన్నీ ఎన్టీఆర్ ఖాతాలో పడుతున్నాయి. మనోడు భలే లక్కీ కదూ.