Begin typing your search above and press return to search.
‘బిగ్ బాస్’ రెండో వారంలోనూ ధనాధన్
By: Tupaki Desk | 4 Aug 2017 4:46 AM GMTమొత్తానికి తెలుగు ‘బిగ్ బాస్’ షో నిలబడిపోయినట్లే కనిపిస్తోంది. పార్టిసిపెంట్ల విషయంలో ముందు ప్రేక్షకుల్లో నిరాశ వ్యక్తమైనా.. వారాంతాల్లో మినహాయిస్తే పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదని.. హౌస్ మేట్స్ అనుకున్నంత స్థాయిలో ఎంటర్టైన్ చేయట్లేదని విమర్శలు వ్యక్తమైనా.. షో రేటింగ్స్ అయితే పడిపోలేదు. రెండో వారంలో కూడా రేటింగ్స్ బాగానే ఉన్నాయి. ‘బిగ్ బాస్’ షో పుణ్యమా అని ‘స్టార్ మా’ ఛానెల్ ఓవరాల్ రేటింగ్స్ పెరిగి.. ఆ ఛానెల్ వరుసగా రెండో వారంలోనూ తెలుగులో నెంబర్ వన్ ఛానెల్ గా కొనసాగడం విశేషం. మొన్నటి ఆదివారం నాటి ‘బిగ్ బాస్’ ఎపిసోడ్ 12.7 టీఆర్పీతో వారంలో అత్యధిక రేటింగ్ దక్కించుకోగా.. ఈ షోకు వారం మొత్తంలో సగటున 12.1 టీఆర్పీ రావడం విశేషం. పార్టిసిపెంట్లు మాత్రమే కనిపించే వీక్ డేస్ లో ఎపిసోడ్లకు సగటున 9.1 టీఆర్పీ వచ్చింది. వీక్ డేస్ లో షో 9-10 మధ్య రేటింగ్స్ కు ఫిక్సయినట్లుగా కనిపిస్తోంది. ఇది కొంచెం తక్కువ రేటింగే అయినప్పటికీ.. అదే రేంజ్ మెయింటైన్ చేయడం.. దానికి మించి తగ్గకపోవడం సక్సెస్ అనే చెప్పాలి.
రెండో వారంలో మధు ప్రియ ఎలిమినేట్ కావడం.. నాటకీయ రీతిలో సంపూర్ణేష్ బాబు నిష్క్రమించడం.. మరోవైపు దీక్షా పంత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. అన్నింటికీ మించి ఎన్టీఆర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వ్యాఖ్యానంతో అదరగొట్టడం ‘బిగ్ బాస్’ షోను వీక్షకులకు చేరువ చేశాయి. ఒక వర్గం ప్రేక్షకులు ఈ షోకు కనెక్టయిపోయి డైలీ ఎపిసోడ్లకు రుచి మరిగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఐతే మున్ముందు ఈ షోకు ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుందా అన్నది చూడాలి.