Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ Vs వైఎస్ ఆర్.. 24 గంటల్లో 2 సినిమాలు
By: Tupaki Desk | 8 Jan 2019 1:30 AM GMTరాజకీయంగా ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యఎలాంటి పోటీ లేదు. ఇద్దరూ రెండు తరాలకు చెందిన వారు. వాళ్ల జమానాలో రాజకీయాలపై తమదైన ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ ఇద్దరు ప్రముఖుల జీవితాలు ఒకేసారి వెండితెరపైకి రావడం - అవి 24 గంటల వ్యవధిలో థియేటర్లలోకి రావడం కాకతాళీయమైతే కాదు.
పైకి చెప్పకపోయినా ఎన్టీఆర్ బయోపిక్ - యాత్ర సినిమాల మధ్య ఎప్పట్నుంచో పోటీ నడుస్తోంది. మేకర్స్ దీనిపై రియాక్ట్ అవ్వకపోయినా - జనాలు మాత్రం కచ్చితంగా ఈ రెండు బయోపిక్స్ ను కంపేర్ చేసి చూడడం ఖాయం. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ వెర్సెస్ వైఎస్ ఆర్ అన్నట్టు తయారైంది బాక్సాఫీస్ వార్.
ఎన్టీఆర్-మహానాయకుడు సినిమా ఫిబ్రవరి7న థియేటర్లలోకి వస్తోంది. ఇందులో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి చూపించబోతున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం నుంచి పార్ట్-2 స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ముగించారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అటు యాత్ర సినిమాలో మాత్రం వైఎస్ ఆర్ జీవితాన్ని చూపించడం లేదు.
వైఎస్ ఆర్ కు ఎనలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమాను తెరకెక్కించారు. పేరుకు పాదయాత్ర కాన్సెప్ట్ అయినప్పటికీ సినిమాలో రాజకీయాలే చూపిస్తున్నారు. సో.. 24 గంటల వ్యవథిలో థియేటర్లలోకి రాబోతున్న ఈ రెండుసినిమాల్లో ఏది ఆడియన్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.