Begin typing your search above and press return to search.

మూడు సార్లు ఫెయిల్ అయిన ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   16 April 2019 11:17 AM GMT
మూడు సార్లు ఫెయిల్ అయిన ఎన్టీఆర్
X
జనవరిలో మొదలైన ఎన్టీఆర్ బయోపిక్ ల ప్రహసనం ఎట్టకేలకు ముగింపుకు వచ్చేసింది. ఆయన నట వారసుడిగా బాలకృష్ణ ఎంతో ముచ్చటపడి తీసిన కథానాయకుడు మహానాయకుడు రెండూ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లుగా మిగలడం అభిమానులు ఊహించనిది. కేవలం ఎన్టీఆర్ ను మహోన్నత కోణంలో మాత్రమే చూపాలన్నబాలయ్య క్రిష్ ల ఆలోచనను ప్రేక్షకులు తిప్పి కొట్టారు. టేకింగ్ పరంగా కంప్లయింట్ లేకపోయినా అసలు లోపం కంటెంట్ లో ఉండటంతో బయ్యర్లకు భారీ నష్టాలు తప్పలేదు. ఆ మహానటుడి బయోపిక్ మరీ ఇంత తిరస్కారానికి గురవవడం షాకే.

ఇదిలా ఉండగా వాటికి పోటీగా వివాదాలను ఎన్టీఆర్ లక్ష్మి పార్వతిల వివాహాన్ని నేపద్యంగా తీసుకుని రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకపోయినా తెలంగాణా సహా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజైపోయింది. పట్టుమని నెల కూడా దాటకుండానే ఫైనల్ రన్ కు వచ్చేసింది. చాలా చోట్ల ఇప్పటికే తీసేసినట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయి. మొదటి రెండు మూడు రోజులు హడావిడి వల్ల వసూళ్లు కనపడ్డాయి కాని ఆ తర్వాత పూర్తిగా చల్లారిపోయింది. కనీసం యావరేజ్ అని చెప్పడానికి కూడా మనసు రానంతగా చాలా చోట్ల నీరసించిపోయింది.

సో మొత్తంగా మూడు సార్లు ఎన్టీఆర్ కథలు తెరమీద చూపిస్తే అన్ని సార్లు ఆడియన్స్ రిజెక్ట్ చేసినట్టు క్లారిటీ వచ్చేసింది. కేతినేని జగదీశ్వర్ రెడ్డి ఏదో లక్ష్మీస్ వీరగ్రంధం అంటూ ఆ మధ్య హడావిడి చేశారు కాని అది అసలు మొదలయ్యిందో లేదో కూడా అనుమానమే. మొత్తానికి కాలం చేసిన హీరో మీద ఒకటి కాదు ఏకంగా మూడు సినిమాలు వచ్చిన ఘనత అయితే ఎన్టీఆర్ కు దక్కింది కాని అందులో ఒక్కటీ సక్సెస్ కాకపోవడమే చింతించాల్సిన విషయం.