Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్.. అన్నయ్యకు బదులు తీర్చేశాడు
By: Tupaki Desk | 5 July 2017 5:24 AM GMTజూనియర్ ఎన్టీఆర్.. నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఒకే తండ్రి బిడ్డలయినా.. చాలా ఏళ్ల పాటు వాళ్లిద్దరి మధ్య అంత సన్నిహిత సంబంధాలేమీ లేవన్నది వాస్తవం. ఎన్టీఆర్ తో మరీ క్లోజ్ ఏమీ కాదన్న విషయాన్ని అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పాడు కళ్యాణ్ రామ్. ఐతే గత కొన్నేళ్లలో అన్నదమ్ములిద్దరి మధ్య బంధం బలపడింది. ఇద్దరూ అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు.
ఆ మధ్య ఓ సినీ వేడుకలో మాట్లాడుతూ తన అన్నయ్య తనకు గర్ల్ ఫ్రెండ్ మాదిరి అంటూ వ్యాఖ్యానించాడు ఎన్టీఆర్. ఇక నెలన్నర కిందట జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజుకు తన వీపు మీద అతను ప్రేమగా ఎక్కి ఉన్న ఫొటో పెట్టి ‘హ్యాపీ బర్త్ డే నాన్నా’ అంటూ కళ్యాణ్ రామ్ ఎంత ఆప్యాయంగా విష్ చేశాడో తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ వంతొచ్చింది. బుధవారం కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అన్నయ్య ఆ రోజు పెట్టినట్లే ఇద్దరి మధ్య అనుబంధాన్ని చాటే ఫొటో పెట్టాడు తారక్.
ఇక్కడ కూడా ఎన్టీఆర్.. వెనుక నుంచి కళ్యాణ్ రామ్ భుజం మీద చెయ్యి వేసి సన్నిహితంగా కనిపిస్తున్నాడు. దీనికి ‘హ్యాపీ బర్త్ డే అన్నా.....’ అంటూ వ్యాఖ్య జోడించాడు తారక్. ఆ రకంగా అన్నయ్యకు దీటుగానే బదులిచ్చాడు జూనియర్. మొత్తానికి ఈ రెండు ఫొటోలు చూస్తే.. అన్నదమ్మల పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్న తీరు చూస్తే.. వాళ్లిద్దరి మధ్య అనుబంధం ఎంత దృఢంగా సాగుతోందో అర్థమవుతోంది. ఎన్టీఆర్ తొలిసారిగా అన్నయ్య నిర్మాణంలో చేస్తున్న ‘జై లవకుశ’ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే.