Begin typing your search above and press return to search.
నన్ను ఇమిటేట్ చేస్తే రిస్క్ లో పడతారు
By: Tupaki Desk | 12 Jan 2016 7:52 AM GMTజూనియర్ ఎన్టీఆర్ ని అన్ని విషయాల్లోనూ ఇమిటేట్ చేయడం చాలా కష్టమైన విషయం. డ్యాన్సులు - ఫైట్ల విషయంలో అయితే కాంపిటీషన్ ఇవ్వడం కూడా క్లిష్టం. కానీ ఇక్కడ ఇమిటేషన్ ఎన్టీఆర్ చూపించిన ఓ ఫీట్ గురించే. నాన్నకు ప్రేమతో ట్రైలర్ రిలీజ్ నుంచే బోలెడు సంచలనాలు సృష్టించింది. చాలామందిలో హాట్ టాపిక్ గా నిలిచింది.
ఇందులో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ ఒక కారణమైతే.. యంగ్ టైగర్ ఉపయోగించిన హోవర్ బోర్డ్ మరో కారణం. లండన్ వీధుల్లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ హోవర్ బోర్డ్ పై.. ఎన్టీఆర్ అలా అలా జర్నీ చేస్తున్న లుక్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ హోవర్ బోర్డ్ కి క్రేజ్ ఏర్పడిపోయింది. చాలా ఐటీ క్యాంపస్ లలో ఇప్పటికే దీన్ని ప్రత్యేకంగా తెప్పించుకుని ఉపయోగిస్తున్నారు. ఇక చిన్నపిల్లలు కూడా తమ తల్లిదండ్రులపై ఈ హోవర్ బోర్డ్ కోసం ఒత్తిడి తెస్తున్నారు. దీని మార్కెటింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. అయితే.. హోవర్ బోర్డ్ పై జర్నీ అంత తేలిక కాదని.. తనను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయద్దని సూచిస్తున్నాడు ఎన్టీఆర్.
తను కూడా పలుసార్లు దీనిపై నుంచి జారి పడ్డానని, వెన్ను నొప్పి వచ్చేంతగా దెబ్బలు తగిలాయని చెప్పాడు . అందుకే దీని విషయంలో ప్రాక్టీస్ లేకుండా ఎలాంటి ఇమిటేషన్స్ చేవద్దని సూచిస్తున్నాడు. ఓసారి ఈ హోవర్ బోర్డ్ పై నుంచి పడిపోయిన సంఘటనను సోదరుడు కళ్యాణ్ రామ్ కి చెబితే.. ఆయన చాలా కంగారు పడ్డాడట కూడా.