Begin typing your search above and press return to search.

తెనాలిలో ఎన్టీవోడి శతజయంతి వేడుకలు.. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

By:  Tupaki Desk   |   28 May 2022 7:30 AM GMT
తెనాలిలో ఎన్టీవోడి శతజయంతి వేడుకలు.. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
X
అభిమానం అందరికి ఉంటుంది. కానీ.. దాన్ని ప్రదర్శించే విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. కొందరు మాటలకే పరిమితం అవుతారు. మరికొందరు చేతల్లో చూపిస్తుంటారు. ఇప్పుడు చెప్పేది రెండో కోవకు చెందింది.

తెలుగోళ్లు మెచ్చిన ఎన్టీవోడి శత జయంతి ఉత్సవాలు ఈ రోజు నుంచి మొదలైన సంగతి తెలిసిందే. ఏడాది పాటు సాగే ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.

అయితే.. ఇంకెక్కడా లేనట్లుగా ఆంధ్రా పారిస్ గా పిలుచుకునే తెనాలికి చెందిన ఒక థియేటర్ నిర్ణయం చూసినప్పుడు.. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనుకోకుండా ఉండలేం.

ఎన్టీఆర్ కట్టించిన పెమ్మెసాని థియేటర్.. అదేనండి రామక్రిష్ణ థియేర్ లో ఈ రోజు నుంచి ఏడాది పొడువుగా.. వారానికి ఐదు రోజుల పాటు ఎన్టీఆర్ సినిమాల్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

ప్రతి రోజు ఉదమం 9 గంటలకు ఉచిత సినిమా ప్రదర్శనను ఈ థియేటర్ లో చేస్తారు.ఈ ఫ్రీ సినిమా ప్రదర్శనను ఈరోజున ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలక్రిష్ణ చేతుల మీదుగా షురూ కానున్నాయి.

శుక్ర.. ఆదివారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ రామక్రిష్ణ థియేటర్లో ఏడాది పాటు.. ప్రతి ఉదయం ఎన్టోవోడి సినిమాను ఉచితంగా ప్రదర్శించటం చూస్తే.. ఇంతకు మించిన శతజయంతి కానుక ఇంకేం ఉంటుందని చెప్పక తప్పదు. ప్రపంచ చిత్ర పరిశ్రమలో మరే నటుడికి ఇలాంటి ఉత్సావాన్ని నిర్వహించలేదేమో?