Begin typing your search above and press return to search.

వైవీఎస్ చౌదరి ఆధ్వర్యంలో 'ఎన్టీఆర్ శత జయంతి' ఉత్సవాలు..!

By:  Tupaki Desk   |   27 May 2021 11:30 AM GMT
వైవీఎస్ చౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు..!
X
నందమూరి తారక రామారావుకు ప్రముఖ దర్శకుడు, నిర్మాత వైవీఎస్ చౌదరి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మీదున్న విపరీతమైన అభిమానంతో సినిమాల్లోకి వచ్చిన వైవీఎస్.. ‘బొమ్మరిల్లు వారి’ బ్యానర్ పై నిర్మించే ప్రతీ
ప్రతి సినిమా ఎన్టీఆర్ ను స్మరించుకుంటున్న ప్రార్ధనాగీతంతో మొదలవుతుంది. మళ్ళీ చివరిలో ఎన్టీఆర్ ఫొటోపై కృతజ్ఞతాభావంతో సినిమా పూర్తవుతుంది. ఎన్టీఆర్ ను అంతగా ఆరాధిస్తారు వైవీఎస్ చౌదరి. అలానే ప్రతి ఏడాది ఎన్టీఆర్ జయంతి, వర్ధంతిల సందర్భంగా న్యూస్‌ పేపర్లో ప్రత్యేక ప్రకటనతో ఆయన్ని స్మరించుకునే సంప్రదాయాలను పాటిస్తున్నారు.

రేపు మే 28న ఎన్టీఆర్ జయంతి ని పురస్కరించుకుని వైవీఎస్ చౌదరి తాజాగా ఓ సుదీర్ఘంమైన ప్రకటన విడుదల చేశారు. ఇండియాలోని ఓ రిక్షాపుల్లర్ నుండి అమెరికాలోని సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ల వరకూ వివిధ రంగాలలో ఉన్న చాలా మందికి ఎన్టీఆర్ ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చారని.. తన ఆశయాలు ప్రసంగాల ద్వారా వారిలో ఉద్వేగాన్ని నింపారని.. అటువంటి మహాపురుషుని మీద ఇష్టం ఏర్పడటం, ఆ ఇష్టం అభిమానంగా మారటం, ఆ అభిమానం ఆరాధనగా మారటం అనేది మానవ సహజమని దర్శకుడు పేర్కొన్నారు.

'ఎన్టీఆర్' పేరు కలిసొచ్చేలా తన మిత్రులు 'New Talent Roars@' (NTR@) అనే బ్యానర్‌ ను ఏర్పాటు చేస్తున్నారని.. నూతన కళాకారుల పరిచయ వేదికగా ఈ బ్యానర్ ఉంటుందని.. అదే బ్యానర్ లో తన దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మించడానికి సంకల్పించారని వైవీఎస్ చౌదరి తెలిపారు. తన ఆధ్వర్యంలో ఎటువంటి లాభాపేక్షలను ఆశించకుండా.. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న వారందరి అనుభవాల్ని, అనుబంధాల్ని ఆకర్షణీయమైన ఇంటర్వ్యూలుగా మలిచి ప్రసారం చేస్తామని చెప్పుకొచ్చారు.

28 మే, 2022 ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రేపటి నుండీ సంవత్సరం పాటు అంటే 27 మే 2023 వరకూ ఆ ఇంటర్వ్యూలను రకరకాల డిజిటల్‌ వేదికల ద్వారా ప్రపంచ వ్యాప్త తెలుగు ప్రజానీకానికి చేరువ చేయాలనే బృహత్తర ప్రణాళికకు రూపకల్పన చేశామని వైవీఎస్ చౌదరి వెల్లడించారు. ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా అందరికీ ఈ విషయాన్ని తెలియజేయడానికి గర్విస్తున్నానని.. ఇలాంటి కార్యాచరణతో మరెంతో మంది ‘అన్న’గారి అభిమానులు ముందుకు రావాలని ఆశిస్తున్నానని వైవీఎస్ చౌదరి రాసుకొచ్చారు.