Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ లో ఇంతటి మార్పా?

By:  Tupaki Desk   |   20 Sept 2017 7:00 AM IST
ఎన్టీఆర్ లో ఇంతటి మార్పా?
X
ఇప్పటి తరం హీరోల్లో మొదటగా స్టార్ స్టేటస్ దక్కించుకున్న హీరో.. జూనియర్ ఎన్టీఆర్. మిగిలిన వారసులు ఇంకా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే.. ఎన్టీఆర్ కు స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అయితే.. ఆ రేంజ్ ను కొనసాగించడంలో విఫలం అయిన మాట వాస్తవమే. కానీ ఎన్టీఆర్ మళ్లీ తన స్థాయిని అందుకునేందుకు బాగానే సమయం పట్టింది.

ఇప్పుడు తన రేంజ్ ను తిరిగి అందుకోవడమే కాదు.. ఒక్క ఉదుటున లాంగ్ జంప్ లు చేసుకుంటూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. మరోవైపు.. వ్యక్తిగతంగా కూడా విపరీతమైన ఛేంజ్ చూపిస్తున్నాడు జూనియర్. గతంలో ఎన్టీఆర్ మాటలకు.. ఇప్పటి మాటతీరుకు అసలేమాత్రం పొంతన లేదన్నది చాలామంది మాట. ఎన్టీఆర్ జైలవ కుశ .. మహేష్ బాబు స్పైడర్ దసరాకే రిలీజ్ కాబట్టి.. మీ ఇద్దరి మధ్య పోటీనా అంటే.. అసలు పోటీ అనే ప్రసక్తే లేదని.. బాగుంటే ఎన్ని సినిమాలైనా ఆడేస్తాయని అనడమే కాదు.. మహేష్ కి గుడ్ లక్ కూడా చెప్పాడు. రీసెంట్ గా తనకు అల్లు అర్జున్ డ్యాన్సులు అంటే ఇష్టమంటూ పెద్ద షాకే ఇచ్చాడు ఈ డ్యాన్సింగ్ స్టార్.

అసలింతకీ జూనియర్ ఎందుకు ఇంత డిప్లమాటిక్ గా మారిపోయాడు? అనే ప్రశ్న చాలామందిని తొలిచేస్తోంది. తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన తర్వాత ఎన్టీఆర్ మైండ్ సెట్ మారిందని.. అయితే.. ఇందుకు కారణం ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రామ్ అని అంటున్నారు. ఓ సమయంలో ఇదే విషయాన్ని తను కూడా చెప్పాడు ఎన్టీఆర్. ఓ మాటలు రాని పసికందు.. ఎన్టీఆర్ ను ఇంతగా మార్చేయడం అంటే.. అదే రక్త సంబంధం మరి.