Begin typing your search above and press return to search.
వీడియో : ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ చరణ్ రియాక్షన్
By: Tupaki Desk | 13 Dec 2021 11:30 AM GMTరాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగి పోయాయి. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకు పోతుంది. సినిమా ట్రైలర్ ను థియేటర్ లో చూసిన సమయంలో అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేయడం జరిగింది.
థియేటర్లలో ట్రైలర్ ను విడుదల చేస్తే అభిమానుల నుండి వచ్చిన రియాక్షన్ ను మనం చూశాం. తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ట్విట్టర్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైలర్ ను చూసిన తర్వాత ఇద్దరు హీరోల రియాక్షన్ ఏంటీ అనేది షేర్ చేశారు. ఇద్దరు హీరోలు కూడా రాజమౌళి ని గట్టిగా హత్తుకున్నారు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఇద్దరు కూడా చిన్న పిల్లల మాదిరిగా ఎగ్జైట్ అవ్వడం వీడియోలో చూడవచ్చు.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి చేసిన ఈ అతి పెద్ద భారీ మల్టీ స్టారర్ సినిమా ను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా విడుదల అయిన ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో మనం అంతా చూస్తూనే ఉన్నాం.
అన్ని భాషల్లో కలిపి వంద మిలియన్ లకు దాదాపుగా చేరువ అయిన ఈ ట్రైలర్ అద్బుతంగా ఉందంటూ సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు మరియు ప్రేక్షకుడు కూడా ఆర్ ఆర్ ఆర్ ను ఎప్పుడెప్పుడు చూస్తాం అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. జక్కన్న బాహుబలి తర్వాత చేసిన సినిమా అవ్వడంతో దేశ వ్యాప్తంగా.. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ కు ఈ సినిమా పై ఆసక్తి ఉంది.
ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. బాహుబలి 2 రికార్డును జక్కన్న రాబోయే సినిమాలు కూడా బ్రేక్ చేయక పోవచ్చు అంటూ మొన్నటి వరకు అంతా అనుకున్నారు. కాని ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ విజువల్స్ చూస్తుంటే.. సినిమాకు వచ్చిన బజ్ చూస్తుంటే సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి.
కనుక ఖచ్చితంగా వసూళ్లు బాహుబలి 2 ను క్రాస్ చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ విజువల్ వండర్ ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. అత్యధిక దేశాల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.