Begin typing your search above and press return to search.
గ్యారేజ్ లో ఫ్యాన్స్ రచ్చ.. ఎన్టీఆర్ క్లాస్
By: Tupaki Desk | 13 Aug 2016 4:19 AM GMTజనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో జూనియర్ అభిమానుల హంగామా మామూలుగా లేదు. వరుసగా హిట్స్ కొడుతున్న తమ హీరో.. ఈసారి ఇండస్ట్రీ హిట్ కొట్టేస్తాడనే ఆశలు వాళ్లలో కనిపించాయి. ఆ ఉత్సాహం చాలా మందిని ఇబ్బంది పెట్టేసింది కూడా. చివరకు ఎన్టీఆర్ స్వయంగా వాళ్లను వేడుకోవాల్సి వచ్చింది.
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతున్నపుడు ఆయన మాటలు వినిపించనంత రేంజ్ లో ఫ్యాన్స్ అరుపులు కేకలు పెట్టేశారు. దీంతో కొరటాల నుంచి మైక్ తీసుకున్న జూనియర్.. 'డైరెక్టర్ మాట్లాడుతుంటే.. అందరూ సైలెంట్ గా ఉండాలని కోరుతున్నా. మధ్యలో ఇలా చేయడం కరెక్ట్ కాదు. మనకు సూపర్ హిట్ ఇవ్వాలని ఆరు నెలలుగా కష్టపడుతున్న వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మనం ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్లీజ్. చేతులు జోడించి వేడుకుంటున్నా.. ఈ సినిమాకి ఆయన పడిన కష్టం అందరికీ తెలియాలి. అది ఆయన పడిన కష్టం. అది ఆయన నోటితో పంచుకుంటే అందరికీ బాగుంటుంది' అంటూ సైలెంట్ గానే చురకలు వేశాడు ఎన్టీఆర్.
అయితే అభిమానులు హర్ట్ కాకుండా ఉండేదుకు.. ''మీరు అరుస్తా ఉన్నా మాకు అది కూడా ఇష్టమే. మీ అరుపులు మా మాటలు కలిపి ఇంకా బాగుంటాయ్'' అంటూ దర్శకుడు కొరటాల ఈ ఇష్యూని సైలెంట్ చేసే ప్రయత్నం చేశాడు.