Begin typing your search above and press return to search.

65 రాత్రులు టార్చ‌ర్ చేశాడ‌న్న తార‌క్

By:  Tupaki Desk   |   10 Jan 2023 1:30 AM GMT
65 రాత్రులు టార్చ‌ర్ చేశాడ‌న్న తార‌క్
X
ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం RRR ప‌లు అంత‌ర్జాతీయ అవార్డు వేడుక‌ల్లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఇప్ప‌టికే ఆస్కార్ రేసులో నిలిచిన ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్స్ లోను మెరుస్తోంది.

నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేట‌గిరీలో భార‌త‌దేశం త‌ర‌పున‌ గోల్డెన్ గ్లోబ్స్ కు నామినేట్ అవ్వ‌డంతో ప్ర‌స్తుతం రాజ‌మౌళి స‌హా ఎన్టీఆర్- రామ్ చ‌ర‌ణ్ అమెరికాలో ఉన్నారు. ఇప్ప‌టికే ఈ వేడుక‌ల కోసం అమెరికా వెళ్లిన చ‌ర‌ణ్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా ఎన్టీఆర్ JR - SS రాజమౌళి RRR గురించి `ది డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా` ఈవెంట్లో చర్చించారు. NTR ఐకానిక్ యానిమల్ సీన్ గురించి.. నాటు నాటు గురించి విస్త్ర‌తంగా చ‌ర్చించారు. ఆ పాట‌ను తెర‌కెక్కించిన విధానం గురించి అలాగే జంతువుల‌తో స‌న్నివేశం గురించి అస‌లు తాను ఊహించ‌లేద‌ని అంత గొప్ప‌గా రాజ‌మౌళి వాటిని తెర‌కెక్కించార‌ని తార‌క్ అన్నారు.

ఎన్టీఆర్ జూనియర్ ఐకానిక్ యానిమ‌ల్స్ ఫైట్ సీన్ గురించి మాట్లాడాడు, ఇది తెరపైకి వచ్చిన వైనంపై అస్స‌లు తాను ఏదీ ఊహించలేదని చెప్పాడు. ఈ చ‌ర్చ‌ల్లో SS రాజమౌళి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఆర్.ఆర్‌.ఆర్ కి ఇందులో నాటు నాటు పాట‌కు ఇలాంటి ఆదరణ ద‌క్కుతుంద‌ని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. తార‌క్ ని రాజ‌మౌళి ప్ర‌శంసించ‌గా.. తార‌క్ త‌న మెంటార్ రాజ‌మౌళిని `గైడింగ్ సోల్` అని పొగిడేశారు. కేవలం 99.9 శాతం ఔట్ పుట్ తో సంతృప్తి చెందే బాప‌తు కాదు. జక్క‌న్న‌ 110 శాతం బెస్ట్ కోరుకుంటాడ‌ని తార‌క్ అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ.. కొమురం భీముడు నేను దర్శకత్వం వహించిన ఉత్తమ పాత్ర‌. నా సినిమాలన్నింటిలో ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఎందుకంటే ఎన్టీఆర్ అంత గొప్ప పెర్ఫార్మర్. ఒక చిన్న కనుబొమ్మపై మాత్రమే కెమెరాను ఉంచి సీన్ తీసినా తార‌క్ ఆ కనుబొమ్మతో అద్భుత‌ ప్రదర్శన ఇవ్వ‌గలడు.. అని త‌న ప్ర‌తిభ‌ను ప్ర‌శంసించాడు.

యానిమ‌ల్స్ బిగ్ ఫైట్ లో వాటితో ఎన్టీఆర్ ఉగ్రురూపంతో దూకే సన్నివేశం గురించి మాట్లాడుతూ..భీమ్ జంతువులతో దూకే షాట్ నాకు చాలా బాగా న‌చ్చింది. అస‌లు ఆ షాట్ ఎలా ఉండాలో నాకు ఎప్పుడూ చెప్ప‌నేలేదు. నేను ఈ జంతువులన్నిటితో క‌లిసి ఎలా దూకబోతున్నానో జ‌క్క‌న్న నాకు ఎప్పుడూ చెప్పలేదు. అతను ఎలా షూట్ చేయబోతున్నాడో వివ‌రించ‌లేదు. నేను సినిమా విడుదల‌య్యాకే చూసాను.. వాహ్ అనిపించేలాగా క‌నిపించాను ఆ స‌న్నివేశంలో.. అని తార‌క్ అన్నారు.

ఎన్టీఆర్ తో `సింక్` గురించి ఎస్ఎ.స్ రాజమౌళి మాట్లాడుతూ.. క‌లిసి నాలుగు చిత్రాలకు పనిచేశాం. మేం చాలా సింక్ లో ఉన్నాము. ఇప్పుడు క‌లిసి నాటు నాటు చేసాం అని తెలిపారు. నాటు నాటు గురించి మాట్లాడుతూ... తార‌క్ ఈ పాట‌ను `ఐసింగ్ ఆన్ ది కేక్` అని వ్యాఖ్యానించాడు. SS రాజమౌళి తననుంచి రామ్ చరణ్ నుంచి ప‌రిపూర్ణ ఔట్ పుట్ ఎలా తీసుకున్నాడో వెల్ల‌డించాడు.

నిజానికి ప‌తాక స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం మమ్మల్ని 65 రాత్రులు జ‌క్కన్న హింసించారు. చ‌ర‌ణ్ నేను సెట్లో కొట్టుకున్నాం. ఒక‌రినొక‌రం చంపుకున్నాం. అయితే ఒకరికొక‌రం క్షమాపణలు చెప్పుకుని స‌ర్ధి చెప్పుకునేవాళ్లం. SS రాజమౌళి నిజంగా మేం ఇద్ద‌రం ఒకరినొకరు ద్వేషించుకోవాలని కోరుకున్నారు. చివరగా 21 లేదా 22 రాత్రి నాటికి మేం క్షమాపణలు చెప్పుకోవ‌డం మానేసి ప‌నిని పూర్తి చేద్దాం అని నిర్ణ‌యించుకున్నాం. ఆ త‌ర్వాత‌ నాటు నాటు తెర‌కెక్కింది... అని తెలిపారు.

ఇద్ద‌రు స్నేహితులం సింక్ లో ప‌ని చేసాం. మేము ఆ పాటను 12 రోజులు పూర్తి చేసాం. రాజ‌మౌళి మమ్మల్ని 8 నుంచి 8 వ‌ర‌కూ హింసించేవాడు. మేము 11:30 కి నిద్రిస్తాము. 5:30 కి మేల్కొనేవాళ్లం. 7 రోజుల రిహార్సల్స్ తర్వాత చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. మా ఇద్ద‌రి న‌డుమా సింక్రోనైజేషన్ కోసం జ‌క్క‌న్న చాలా నరకం చూపించాడు. కానీ సింక్రొనైజేషన్ పై ఎందుకు ఎక్కువ ఒత్తిడి చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. అయితే ఈ పాట ప్రోమోకు వచ్చిన రియాక్షన్స్ చూసాక నా ఆలోచ‌న మారింద‌ని తార‌క్ తెల‌పాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.