Begin typing your search above and press return to search.
జనతా గ్యారేజ్.. వర్కింగ్ టైటిల్ కాదు
By: Tupaki Desk | 12 Jan 2016 10:41 AM GMT‘నాన్నకు ప్రేమతో’ తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసింది. ఈ చిత్రానికి ‘జనతా గ్యారేజ్’ అనే టైటిల్.. ‘ఇక్కడ అన్నీ రిపేరు చేయబడును’ అనే క్యాప్షన్ అనుకుంటున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఐతే కొరటాల కానీ, నిర్మాతలు కానీ వీటిని కన్ఫమ్ చేయకపోవడంతో జనాల్లో కొంత డౌట్లు ఉన్నాయి. ఎన్టీఆర్ ఆ డౌట్లు తీర్చేస్తూ.. టైటిల్, క్యాప్షన్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. జనతా గ్యారేజ్ అనేది వర్కింగ్ టైటిల్ కాదని, ఇదే సినిమాకు ఒరిజినల్ టైటిల్ అని.. ‘ఇక్కడ అన్నీ రిపేరు చేయబడును’ అనే క్యాప్షన్ పెడుతున్న మాట కూడా నిజమేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు యంగ్ టైగర్.
కొరటాల, తాను కలిసి ఈ సినిమా గురించి చాలా మాట్లాడుకున్నామని.. కొరటాలకు అనేక కొత్త ఆలోచనలున్నాయని.. ‘నాన్నకు ప్రేమతో’ రిజల్ట్ ను బట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది నిర్ణయించుకుంటామని ఎన్టీఆర్ చెప్పాడు. ‘జనతా గ్యారేజ్’ తెలుగుతో పాటు మలయాళంలోనూ తెరకెక్కబోతోందని కూడా ఎన్టీఆర్ వెల్లడించాడు. ఫిబ్రవరిలో సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయన్నాడు. తన అన్నయ్య కళ్యాణ్ రామ్ బేనర్లో తన తర్వాతి సినిమా ఉండొచ్చని.. ఐతే దానికి దర్శకుడెవరన్నది ఇంకా ఖరారవలేదని ఎన్టీఆర్ చెప్పాడు. నిర్మాణంలోకి దిగుతారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అది చాలా తలనొప్పితో కూడుకున్న పని. అయినా మా అన్నయ్య బేనర్ ఉండగా.. నేను సొంతంగా నిర్మాణంలోకి దిగాల్సిన అవసరమేంటి?’’ అని ప్రశ్నించాడు తారక్.